అద్వానీ కోసం ఒక కుర్చీ న్యూఢిల్లీ : ఒక ఆసనం (పదవి) ఎల్.కె. అద్వానీకి, ఆయన పార్టీకి ఒక వసతిని సమకూర్చింది. మరొక ఆసనం ఆయనకు ఒక గదినే ఏర్పాటు చేయవచ్చు. భారతీయ జనతా పార్టీ (బిజెపి) అద్వానీని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్ డిఎ) కార్యనిర్వాహక (వర్కింగ్) చైర్మన్ గా ప్రకటించాలని యోచిస్తున్నది. పార్లమెంట్ భవనంలో ఆయన కోసం ఒక కార్యాలయాన్ని సమకూర్చడమే ఈ ప్రతిపాదన ఆంతర్యం. అద్వానీకి కనుక ఈ పదవి లభిస్తే, క్రమంగా పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు ఆయన ఎన్ డిఎను సమావేశపరచి, అధ్యక్షత వహించవచ్చు.
లోక్ సభలో ప్రతిపక్ష నాయకుని పదవిలో నుంచి తప్పుకున్న తరువాత అద్వానీ పార్లమెంట్ భవనంలో తన గదిని కోల్పోయారు. ఆ తరువాత పార్టీ ఆయనను బిజెపి పార్లమెంటరీ పార్టీ చైర్మన్ గా నియమించింది. ఆ వెటరన్ నాయకునికి పూర్తి రిటైర్ మెంట్ పరిస్థితిని తప్పించడం, పార్టీ పార్లమెంటరీ వ్యూహాల రూపకల్పనలో ఆయనకు పాత్ర కల్పించడం లక్ష్యంగా ఆయనను ఆ పదవిలో నియమించారు. అయితే, ఆ పదవికి రాజ్యాంగపరమైన అధికారం ఏమీ లేదు.
అద్వానీని ఎన్ డిఎకి కార్యనిర్వాహక చైర్ పర్సన్ ను చేసిన పక్షంలో ఆయన అటల్ బిహారి వాజపేయి నేమ్ ప్లేట్ ఉన్న ఒక గదిలో నుంచి విధులు నిర్వర్తించే అవకాశం ఉంది. వాజపేయి ఎంపి కాకపోయినప్పటికీ ఆయన ఎన్ డిఎ చైర్ పర్సన్ గా కొనసాగుతున్నారు. అయితే, వయస్సు, అనారోగ్యం కారణంగా ఆయన సంబంధిత విధులు నిర్వర్తించలేకపోతున్నారు. బిజెపి నుంచి ప్రధాని పదవిని నిర్వహించిన ఏకైక నేతగా పార్టీలోను, సంఘ్ పరివార్ లోను వాజపేయికి ఉన్న ప్రాముఖ్యం దృష్ట్యా ఆ సువిశాలమైన ఆఫీసును మరెవ్వరూ ఎన్నడూ ఉపయోగించలేదు.
Pages: 1 -2- News Posted: 9 January, 2010
|