సౌండ్ చేస్తే ఇక రౌండే న్యూఢిల్లీ : హాయిగా నిద్ర పోతూ కలల లోకంలో విహరించాల్సిన సమయంలో పక్కింటి నుండి భారీ శబ్ధంతో మ్యూజిక్.. ఎదురుగా బిల్డింగ్ నిర్మాణ పనుల హోరు..ఆ పక్కనే భారీ సౌండ్ తో పార్టీలు..లేదా వాహనాల హారన్..అదీకాకపోతే చెవులు రివ్వుమనేలా టపాసులు పేలుడు శబ్థం.. వీటిలో ఏదోఒక దానితో ఎపుడోకపుడు ఇబ్బందులు పడనివారుండరు. రోజంతా పని ఒత్తిడితో అలసిసొలసి ఇంటికి వచ్చి హాయిగా నిద్ర పోవాలనుకున్న సమయంలో ఈ శభ్ధకాలుష్యంపై చిర్రెత్తుకొచ్చినా చికాకు పడటం మినహా చేయగలిగేదేముందని నిట్టూర్చి సర్ధకుపోయేవారు.
అయితే ఇపుడు అలాంటి వారికి కోపం తీర్చుకునే ఓ సదావకాశం త్వరలోనే అందుబాటులోకి రానుంది. శబ్ధాలతో అర్థరాత్రుళ్ళు ఆగడాలు చేసే వారిని శిక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్దమవుతోంది. రాత్రి పది గంటల నుండి తెల్లవారుజామున ఆరు గంటల మధ్య నివాసిత ప్రాంతాల్లో శబ్దకాలుష్యం చేస్తే భారీ జరిమానా విధించాలని, అలాగే జైలు శిక్ష విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఎంపిక చేసిన కొన్ని మెట్రో సిటీల్లో మాత్రమే దీన్ని ప్రయెగాత్మకంగా అమలు చేయాలని యోచిస్తోంది. కోల్ కత, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, ముంబయి, లక్నో వంటి నగరాల్లో తొలుత ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని భావిస్తున్నట్లు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి జైరామ్ రమేష్ వెల్లడించారు.
Pages: 1 -2- News Posted: 15 January, 2010
|