హమ్మో! ఎంత అవినీతి? ముంబై : దేశంలో అవినీతి విలువ రెండున్న లక్షల కోట్ల రూపాయలకు మించిపోవచ్చునని మేనేజ్ మెంట్ గురు సి.కె. ప్రహ్లాద్ సూచించారు. ముంబైలో ఏడవ నాని ఎ పాల్ఖీవాలా స్మారకోపన్యాసం ఇచ్చిన ప్రహ్లాద, రాజకీయ నాయకుల ఎన్నికల ప్రచారాలకు నిధులు సమకూర్చడం గురించి, ఎన్నికైన తరువాత ప్రతిఫలం కోసం ప్రయత్నించడం గురించి ప్రధానంగా ప్రస్తావించారు. దేశంలో అవినీతి ప్రబలడానికి ప్రాథమిక కారణాలలో ఇది ఒకటని ఆయన పేర్కొన్నారు.
2009 లోక్ సభ ఎన్నికల నిర్వహణకు 10 వేల కోట్లు రూపాయలు ఖర్చయినట్లు తెలుస్తున్నది. ఇందులో 1300 కోట్ల రూపాయలను ఎన్నికల కమిషన్, 700 కోట్ల రూపాయలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేశాయి. మిగిలిన 8000 కోట్ల రూపాయలను రాజకీయ పార్టీలు, వ్యక్తిగత అభ్యర్థులు ఖర్చు చేశారు. రాష్ట్ర శాసనసభల ఎన్నికల వ్యయాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటే ఇది 25 వేల కోట్ల రూపాయలను తేలికగా దాటగలదని ఆయన పేర్కొన్నారు.
'సముచిత లాభాలు వస్తాయనే ఉద్దేశంతోనే ఈ స్థాయిలో ఎన్నికలకు ప్రైవేట్ గా నిధులు వెచ్చిస్తున్నారని నా భావన' అని ప్రహ్లాద చెప్పారు. 'ఎన్నికలలో పెట్టుబడులు రిస్క్ తో కూడుకున్నవి కనుక వెంచర్ కాపిటలిస్టుల వలె రాజకీయ నాయకులు పదింతల కన్నా తక్కువగా లాభం ఆర్జించడానికి సిద్ధపడరని భావించవచ్చు' అని ఆయన పేర్కొన్నారు. దేశం కోసం ఒక ప్రణాళికను రూపొందిస్తూ, సమాచారం ఎప్పటికప్పుడు అందేట్లు చూడాలని, చట్టాల అన్వయ సూత్రాల సంఖ్యను తగ్గించాలని, జవాబుదారీతనాన్ని పెంచాలని సూచించారు.
Pages: 1 -2- News Posted: 15 January, 2010
|