తెలంగాణ ఇవ్వాలంటే...? న్యూఢిల్లీ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు అంగీకరించే ముందు రాష్ట్రంలో మావోయిస్టుల కార్యకలాపాలను, సార్వత్రిక శాంతి భద్రతల పరిస్థితిని కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుందని అభిజ్ఞ వర్గాల ద్వారా తెలుస్తున్నది. తెలంగాణ అంశాన్ని తేల్చే ముందు రాష్ట్రంలో ప్రశాంతత నెలకొనడానికే ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని కేంద్ర హోమ్ శాఖ మంత్రి పి. చిదంబరం ఇటీవల మీడియాతో చెప్పారు. కేంద్రం, కాంగ్రెస్ అధిష్ఠాన వర్గం ఈ దిశగా అప్పుడే చర్యలు తీసుకోనారంభించినట్లు ఆ వర్గాలు తెలియజేశాయి.
ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య పాలనా యంత్రాంగంలో మార్పులు చేస్తున్న తీరును ఎవరు పరిశీలించినా ఈ విషయం స్పష్టం అవుతుంది. రాష్ట్ర విభజనపై ఉద్యమాల కారణంగా పాలనా యంత్రాంగం స్తంభించిపోయిన సంగతి విదితమే. కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి పేషీలో చాలా సమీక్షా సమావేశాలు జరుగుతున్నాయి. పాలనా యంత్రాంగం యథాపూర్వ స్థితికి చేరుకుంటున్నదనడానికి ఇది సూచిక.
రాష్ట్రంలో పెరుగుతున్న మావోయిస్ట్ కార్యకలాపాల పట్ల 'ఏమాత్రం ప్రమత్తంగా ఉండవద్దు' అని రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ (డిజిపి) ఆర్.ఆర్. గిరీష్ కుమార్ కు కేంద్ర హోమ్ మంత్రి పి. చిదంబరం, రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్ఎల్. నరసింహన్ సలహా ఇచ్చారు. వివిధి జిల్లాలలో, ముఖ్యంగా ఛత్తీస్ గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలో నిరంతరం నిఘా వేసి ఉంచాలని తమ శాఖ సిబ్బందిని గిరీష్ కుమార్ కోరినట్లు ఆ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో కొనసాగేందుకు 24 సిఆర్పీఎఫ్ కంపెనీలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. మరి 12 కంపెనీలను పంపాలని కేంద్రం యోచిస్తున్నది.
Pages: 1 -2- News Posted: 18 January, 2010
|