లోపాలే శాపాలు హైదరాబాద్ : దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరె రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోవడానికి సంబంధించి మరికొన్ని కొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి. పైలట్ లు సమర్ధవంతంగా వ్యవహరించలేకపోవడం వల్లే హెలికాప్టర్ ప్రమాదం సంభవించిందని విచారణ కమిటీ తేల్చినట్లు ప్రభుత్వం ప్రకటించగా, ఇంధన సరఫరాలో లోపం తలెత్తడంతోనే ప్రమాదం జరిగిందని డీజీసీఏ పేర్కొంటోంది. హెలికాప్టర్ ఘటనపై కేంద్ర ప్రభుత్వం డీజీసీఏ కమిటీని నియామకం చేసింది. ఈ కమిటీ నివేదికలోని అంశాలను ప్రభుత్వం ఒకలా చెబుతుంటే, డీజీసీఏ తన వెబ్ సైట్ లో ఉంచిన నివేదిక మరోలా ఉంది. ఈ రెండింటి మధ్య కొన్ని అంశాలు తేడాలున్నాయి.
ఈ వెబ్ సైట్ లో ఉంచిన నివేదిక మేరకు సెప్టెంబర్ 2 తేదీన వై ఎస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో ఆయిల్ ట్రాన్స్ మిషన్ లో సమస్య తలెత్తడంతో ఆయిల్ ప్రెషర్ బాగా తగ్గిపోయినట్లు పైలట్ లు కనుగొన్నారని పేర్కొంది. దీనికి తోడు ప్రతికూల వాతావరణం వల్ల చివర 12 సెకెన్ లలో హెలికాప్టర్ నిమిషానికి 14 వేల అడుగుల వేగంతో కిందకు పడిపొయి కొండను ఢీకొని పేలిపోయిందని వివరించింది. అయితే బుధవారం ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో మాత్రం విలువైన చివరి ఆరు నిమిషాలు మాన్యువల్ చూస్తూ గడిపేసారని పేర్కొనగా, వెబ్ నివేదికలో ఈ అంశాన్ని పెద్దగా ప్రస్తావించకపోవం విశేషం. త్యాగి నివేదిక మేరకు 2009 సెప్టెంబర్ 2 వ తేదీన వై ఎస్ బెల్ హెలికాప్టర్ లో బేగంపేట ఎయిర్ పోర్టు నుండి బయలుదేరారని పేర్కొన్నారు. అక్కడ నుంటి ప్రయాణం సాగిన వివరాలను ఈ క్రింది విధంగా పేర్కొన్నారు.
Pages: 1 -2- News Posted: 22 January, 2010
|