వెబ్ సైట్లకూ చైనా నకిలీ బీజింగ్ : గూగుల్, యూట్యూబ్ లకు నకిలీ వెబ్ సైట్లు చైనాలో ఆవిర్భవించాయి. అసలు సిసలు గూగుల్ నుంచి స్థానిక కార్యకలాపాలపై చైనా వివాదాన్ని ఎదుర్కొంటున్న సమయంలోనే ఇది జరగడం గమనార్హం.
అసలు సిసలు యూట్యూబ్ నుంచి వీడియో కార్యక్రమాలను యూట్యూబ్ సిఎన్ డాట్ కామ్ (YouTubecn.com) ఆఫర్ చేస్తున్నది. గూగుల్ ఆధిపత్యంలోని యూట్యూబ్ వీడియోలను చైనా తమ దేశంలో ప్రదర్శించకుండా అడ్డుకుంటున్నది. ఇక గూగుల్ నకిలీ సైట్ ను 'గూజ్జె' (Goojje)గా పేర్కొంటున్నారు. అమెరికా ప్రధాన కేంద్రంగా గల ఈ సంస్థ (గూగుల్)ను చైనా నుంచి నిష్క్రమించవద్దనే అభ్యర్థనను కూడా ఈ నకిలీ సైట్ చేస్తున్నది. వెబ్ సెన్సార్ షిప్, సైబర్ దాడులకు సంబంధించిన వివాదంతో చైనా నుంచి తప్పుకుంటామని గూగుల్ ఈ నెలలో బెదరించిన సంగతి విదితమ గూగుల్ బెదరింపు ప్రకటన చేసిన కొన్ని రోజులకే జనవరి మధ్య భాగంలో ఈ రెండు సైట్లు ఒక రోజు తేడాతో అవతరించాయి. ఇవి రెండూ గురువారం కూడా పని చేశాయి. అయితే, వీటి విషయమై చైనా అధికారులు ఏ చర్య తీసుకుంటారనేది స్పష్టం కాలేదు.
అక్రమంగా నడుస్తున్న వెబ్ సైట్లపై చైనా జాతీయ కాపీరైట్ ప్రాధికార సంస్థ (ఎన్ఆర్ఎ) దాడులు ప్రారంభించింది. ఈ సంస్థ నైతిక ప్రవర్తన నియమావళిని కూడా ఈ నెల జారీ చేసింది. అయితే, కొత్త అనుకరణ సైట్ల గురించి గురువారం తన సైట్ లో ఈ సంస్థ ఎటువంటి ప్రకటననూ పొందుపరచలేదు. ఈ విషయమై గూగుల్ ఎటువంటి వ్యాఖ్యానమూ చేయలేదు. 'మాకు అనుబంధ ప్రతిపత్తి లేదని నిర్థారించడం మాత్రమే ఈ క్షణంలో మీకు స్పష్టం చేయగలను' అని గూగుల్ అధికార ప్రతినిధి జెస్సికా పోవెల్ ఒక ఇ-మెయిల్ లో పేర్కొన్నారు.
Pages: 1 -2- News Posted: 29 January, 2010
|