పైలట్ గా మాజీ మంత్రి న్యూఢిల్లీ : పౌర విమానయాన శాఖ మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ అధికార ప్రతినిధి రాజీవ్ ప్రతాప్ రూడీని ఢిల్లీకి చెందిన ప్రైవేట్ విమాన సంస్థ ఇండిగో ఎయిర్ లైన్స్ గౌరవ ప్రాతిపదికపై కో పైలట్ గా నియమించింద. ఒక వాణిజ్య విమాన సంస్థ తరఫున విమానాన్ని నడుపుతున్న తొలి భారతీయ పౌర విమానయాన శాఖ మంత్రి రూడీ. ఆయన జనవరి 4 నుంచి ఇండిగో సంస్థలో తన విధులను నిర్వర్తిస్తున్నారు. ఒక వాణిజ్య విమాన సంస్థ తరఫున విమానం నడిపిన ఏకైక ప్రధాని రాజీవ్ గాంధి అనే సంగతి విదితమే.
ఎయిర్ బ స్ ఎ320 విమానాన్ని నిర్దిష్ట గంటల పాటు నడపాలన్న నిబంధనను పాటించడానికే రూడి ఇలా చేస్తున్నారు. ఫ్లోరిడాలోని మియామిలో గల యుఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఎఎ) ఆమోదముద్ర ఉన్న సిమ్ సెంటర్ నుంచి ఎయిర్ బస్ ఎ320 కోసం రూడి 2007లో కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందారు. ఈ లైసెన్సును ప్రతి రెండేళ్లకు రెన్యూ చేసుకోవలసిన అవసరం ఉంది. 'నేను క్వాలిఫైడ్ ఎయిర్ బస్ ఎ320 పైలట్ ను. నా లైసెన్సును కొనసాగించుకోవడానికి నేను ఒక నిర్దుష్ట తరహా విమానాన్ని నడపవలసి ఉంటుంది. ఎయిర్ ఇండియా విమానాన్ని నడపడాన్ని నేను ఇష్టపడి ఉండేవాడిని, కాని అటువంటి అవకాశం లేనందున ఇండిగో ఆఫర్ ను ఎంచుకున్నాను' అని రూడీ 'బిజినెస్ స్టాండర్డ్' పత్రిక విలేఖరితో చెప్పారు. తన నిర్ణయానికి బిజెపి సీనియర్ నాయకులు మద్దతు తెలిపారని ఆయన చెప్పారు.
Pages: 1 -2- News Posted: 30 January, 2010
|