మెడికల్ పిజి ఇక ఈజీ ముంబై : మెడిసిన్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికై దేశంలోని వైద్య కళాశాలల్లో 'అర సీటు' కోసం పోటీ పడుతున్న లేదా రష్యాకు వలస వెళుతున్న విద్యార్థుల కళ్లలో ఆశాజ్యోతులు వెలగబోతున్నాయి. రానున్న విద్యా సంవత్సరంలో వివిధ రాష్ట్రాలలో అదనపు పిజి మెడికల్ సీట్ల కల్పనకు భారత వైద్య మండలి (ఎంసిఐ) అనుమతి ఇచ్చింది. అదనంగా సుమారు 2000 సీట్లు కేటాయించబోతున్నారు. వీటిలో సింహభాగం తమిళనాడులో లభిస్తుండగా, కర్నాటక, గుజరాత్, మహారాష్ట్ర తరువాత స్థానాలలో ఉన్నాయి.
ప్రస్తుతం ఎండి (అనస్తీషియా) వంటి కొన్ని విభాగాలలో మహారాష్ట్రలోని కొన్ని కళాశాలల్లో జనరల్ కేటగరీ విద్యార్థికి ఒక సీటు రెండేళ్లకు ఒకసారి లభిస్తున్నది. అంటే ఈ విద్యార్థి డాక్టర్లకు 'ప్రతి సంవత్సరం అర సీటు' మాత్రమే అందుబాటులో ఉంటున్నదన్నమాట. ఈ నియంత్రణ సంస్థకు 12 రాష్ట్రాలలో 45 వైద్య కళాశాలల నుంచి దరఖాస్తులు అందినట్లు ఎంసిఐ సభ్యుడు వేద్ ప్రకాశ్ మిశ్రా తెలియజేశారు. 'మార్చి నెలాఖరుకల్లా పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యలో సీట్లు 2000 మేరకు పెరుగుతాయి' అని ఆయన తెలిపారు.
ఎంసిఐ ఎటువంటి తనిఖీలు లేకుండానే ఈ విస్తరణకు పూనుకుంటున్నది. ప్రతి ప్రొఫెసర్ కు రెండు పిజి సీట్లను పొందడానికి ప్రతి కళాశాలను అనుమతించాలన్న కొత్త సూత్రం ప్రాతిపదికపై ఎంసిఐ ఈ ప్రక్రియను చేపట్టుతున్నది. ఇంతకుముందు ఒక ప్రొఫెసర్ కు ఒక సీటును మాత్రమే ఎంసిఐ అనుమతించేది. అంటే విద్యార్థి - ఫ్యాకల్టీ నిష్పత్తి 1:1గా ఉండేది.
Pages: 1 -2- News Posted: 1 February, 2010
|