శ్రీకృష్ణ ఓకె, మరి...? హైదరాబాద్ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు డిమాండ్ పై పరిశీలన కోసం కమిటీ చైర్మన్ గా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి బి.ఎన్. శ్రీకృష్ణను నియమించినందుకు కేంద్రానికి అన్ని వర్గాల నుంచి అభినందనలు వస్తున్నాయి. కాని కమిటీలోని మిగిలిన నలుగురు సభ్యుల విషయంలో మాత్రం అలా జరగడం లేదు. వారు అంతగా పేరు లేనివారని, ఇంతటి సున్నితమైన బాధ్యత చేపట్టేందుకు వారు అర్హులు కాకపోవచ్చునని చాలా మంది అభిప్రాయం. కమిటీలోని ఇతర సభ్యులు ఢిల్లీలోని జాతీయ న్యాయశాస్త్ర విశ్వవిద్యాలం వైస్ చాన్స్ లర్ ప్రొఫెసర్ రణబీర్ సింగి, అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధనా సంస్థ సీనియర్ రీసర్చ్ ఫెలో డాక్టర్ అబూసలెహ్ షరీఫ్, ఢిల్లీ ఐఐటిలో హ్యూమానిటీస్, సోషల్ సైన్సెస్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ రవీందర్ కౌర్. కేంద్ర హోమ్ శాఖ మాజీ కార్యదర్శి వి.కె. దుగ్గల్ కమిటీ సభ్యుడుగాను, కార్యదర్శిగాను వ్యవహరిస్తారు.
ఈ సభ్యులలో హైదరాబాద్ తో లేదా రాష్ట్రంతో ఏమాత్రమైనా సంబంధం ఉన్నది ఒక్క రణబీర్ సింగ్ కే. హైదరాబాద్ లోని నల్సార్ యూనివర్శిటీ పూర్వపు అవతారంతో సహా దాదాపు ఒక దశాబ్దం పాటు సంబంధం ఉన్న రణబీర్ యుజిసి, జాతీయ మదింపు, గుర్తంపు మండలి (నాక్) నియమించిన పలు కమిటీలకు సారథ్యం వహించారు. 'ఆయన పని విషయంలో నిష్కర్షగా వ్యవహరించే వ్యక్తి. తమ కెరీర్ లపై దృష్టి నిలపవలసిందిగా ఆయన లా విద్యార్థులను కోరారు. విద్యార్థి సంఘం ఎన్నికలను నిషేధించేట్లుగా కూడా ఆయన చేయగలిగారు' అని ఆయన సహచరుడు ఒకరు చెప్పారు.
Pages: 1 -2- News Posted: 4 February, 2010
|