మృత్యుకూపాలుగా ఆస్పత్రులు హైదరాబాద్ : నలుగురి ప్రాణాలు తీసిన పార్క్ ఆసుపత్రి అగ్ని ప్రమాదం అనేక చేదు నిజాలను బయటపెడుతోంది. పార్క్ హెల్త్ కేర్ ఆసుపత్రి యాజమాన్యం నిబంధనలను తోసిరాజని అక్రమంగా ఒక అదనపు అంతస్తును నిర్మించింది. నగరంలో ఇటువంటి పనే చేసిన ఆసుపత్రులు ఇంకా అనేకం ఉన్నాయి. జంట నగరాలలోని 1100 ప్రైవేట్ ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్ లలో కనీస అగ్నిమాపక పరికరాలు ఉన్నవి కొన్ని కూడా లేవు. అదనపు అంతస్తుల నిర్మాణానికి 'నిరభ్యంతర సర్టిఫికెట్' జారీ కోసం కార్పొరేట్ ఆసుపత్రులు చేసిన పలు అభ్యర్థనలు అగ్నిమాపక శాఖ వద్ద పెండింగ్ లో ఉన్నాయి.
'చాలా వరకు ఆసుపత్రులలో రాకపోకలకు సరైన సౌకర్యాలే లేవు. భవనాల చుట్టూ ఖాళీ ప్రదేశమే ఉండడం లేదు. ఆసుపత్రులలో ఏ ఒక్కదానికీ అత్యవసర పరిస్థితులలో ఉపయోగించేందుకు స్ట్రెచర్లు, సురక్షతంగా తరలించే కుర్చీలు, ర్యాంపులు మొదలైవని లేవు' అని అగ్నిమాపక శాఖ అధికారి ఒకరు చెప్పారు. జిహెచ్ఎంసి, అగ్నిమాపక శాఖలు ఈ ఉల్లంఘనలను పట్టించుకోవడం లేదు. జాతీయ భవన నిర్మాణ కోడ్ (ఎన్ బిసి), రాష్ట్ర ప్రభుత్వ నియమావళి ప్రకారం, ఎత్తుతో నిమిత్తం లేకుండా అన్ని ఆసుపత్రులలో అగ్నిమాపక పరికరాలు ఉండి తీరాలి. అయితే, కనీసం పది శాతం ఆసుపత్రులు కూడా ఈ నిబంధనలను పాటించడం లేదు.
Pages: 1 -2- News Posted: 4 February, 2010
|