ఆకాశంలో వాలంటైన్స్ డే
ముంబయి : ఈ వాలంటైన్స్ డే నాడు స్వేచ్ఛగా విహరించే ప్రేమజంటలను శివసేన, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు పట్టుకోలేకపోవచ్చు. ఎందుకంటే వీరు పబ్బుల్లోనో, పార్కుల్లోనో, బైకుల మీదో విహరించాలనుకోవడం లేదు. అంతనంత ఎత్తా ప్రేమాలోకం.. సంగతేందో చూద్దాం.. దా! అన్నట్టుగా ఈ ప్రేమ పక్షులు ఆకాశంలో విహరించడానికి తహతహలాడుతున్నాయి. అసలే ప్రేమ పక్షులంతా ఊహాలోకంలో విహరిస్తూ గాల్లో తేలుతూ ఉంటారు. అయితే ఈ సారి కేవలం ఊహలతోనే సరిపెట్టకుండా నిజంగానే గాల్లో తేలేందుకు ప్రేమపక్షులన్నీ ముస్తాబవుతున్నాయి. తన ప్రియురాలితో కలసి విమానయానం చేయడం ద్వారా గాల్లే తేలిపోవాలని కొందరు అబ్బాయిలు ప్లాన్ ను సిద్ధం చేసేసారు. ప్రపంచంలోని ప్రేమికులంతా సంబరాలు జరుపుకునే ప్రేమికుల రోజు వాలంటైన్స్ డే ని కొన్ని ప్రేమ జంటలు ఇందుకు ముహూర్తంగా నిర్ధారించుకున్నాయి. ఈ అపురూప క్షణాలు కోసం అపుడే నిరీక్షణలు కూడా మొదలయ్యాయి.
ఫిబ్రవరి 14 తేదీన ప్రేమికుల దినోత్సవాన్ని కొన్ని ప్రేమ జంటలు వినూత్నంగా జరుపుకోవాలని తహతహలాడుతున్నాయి. ఎప్పుడూ బైక్ లు, కార్లుతో షికార్లు కాకుండా ఈ సారి ఆకాశంలో విహరిస్తూ ప్రేమాయణం సాగించాలని ముంబయి జంటలు తెగ ఉత్సాహపడుతున్నాయి. ఈ మేరకు విమానయాన సంస్థలతో మాట్లాడి ఏకంగా ప్రత్యేక హెలికాఫ్టర్ లో నీలాకాశంలో ప్రేమ ప్రయాణం సాగించేందుకు కొందరు ప్రేయసి ప్రియులు సిద్ధమయ్యారు. ఇందుకోసం ప్రత్యేక విమానాలను బుక్ చేసుకుని ప్రేమికుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని కలలు కంటున్నారు. ముంబయికి చెందిన స్టాక్ బ్రోకర్ మయూరేష్ విద్వాన్ జంట గాల్లే విహారం చేసేందుకు రాబిన్సన్ -44 హెలికాప్టర్ విమానాన్ని ప్రత్యేకంగా బుక్ చేసుకున్నాడు. ఆకాళంలో హెలికాప్టర్లో తన పెళ్లి ప్రతిపాదనను ప్రియురాలికి చెప్పేందుకే ఈ ఏర్పాట్లు చేసుకున్నట్లు మయూరేష్ చెప్పాడు. అలాగే ప్రేమ వివాహం చేసుకున్న జయదీప్ గోస్వామి (పేరుమార్చడమైనది) కూడా తన భార్యతో కలసి చాప్టర్ ప్రయాణం చేయనున్నారు. ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవాన్ని విభిన్నంగా జరుపుకునేందుకే ఈ ప్లాన్ చేసినట్లు ఆయన చెప్పారు.
Pages: 1 -2- News Posted: 8 February, 2010
|