రోశయ్యకు అగ్ని పరీక్ష హైదరాబాద్ : రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణారాహిత్యం పెచ్చుమీరిపోతుండగా ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మొదటిసారిగా రాష్ట్ర శాసనసభ పూర్తి బడ్జెట్ సమావేశాన్ని ఎదుర్కొనబోతున్నారు. గత డిసెంబర్ లో ముఖ్యమంత్రిగా ఆయన తొలి శాసనసభ సమావేశాలను ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించకుండానే అర్ధంతరంగా నిరవధికంగా వాయిదా వేయవలసి వచ్చింది. రాష్ట్రాన్ని విభజించనున్నట్లు కేంద్ర హోమ్ శాఖ మంత్రి పి. చిదంబరం చేసిన ప్రకటనకు ఆక్షేపణ తెలియజేస్తూ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల ఎంఎల్ఎలు మూకుమ్మడిగా రాజీనామా చేయడంతో సభను అర్ధంతరంగా ఆపేశారు.
మూడు రోజుల ఢిల్లీ పర్యటన అనంతరం రోశయ్య ఆదివారం సాయంత్రం హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. కాంగ్రెస్ ఎంఎల్ఎల క్రమశిక్షణారాహిత్యం గురించి ఆయన ప్రధానంగా పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. మొండి వైఖరితో ఉన్న కాంగ్రెస్ ఎంఎల్ఎలను దారికి తీసుకురావడంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధి, ఆమె రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ జోక్యాన్ని రోశయ్య అర్థించినట్లు, వారి మొండివైఖరే పెద్ద తలనొప్పిగా ఉందని ఆయన చెప్పినట్లు పార్టీ వర్గాలు తెలియజేశాయి.
Pages: 1 -2- News Posted: 8 February, 2010
|