సిగరెట్లపై 'సుప్రీం' కన్ను న్యూఢిల్లీ : అంతర్జాతీయ సిగరెట్ బ్రాండ్లను చట్టబద్ధమైన చిత్రాల హెచ్చరికలు లేకుండా భారతదేశంలోని విమానాశ్రయాలలో డిపార్చర్ లాంజ్ లలోని డ్యూటీ ఫ్రీ దుకాణాలలో ?లేదా? అనేది సుప్రీం కోర్టు నిర్ణయిస్తుంది. డిపార్చర్ లాంజ్ లలోని డ్యూటీ రహిత దుకాణాలలో విక్రయిస్తున్న సిగరెట్లు 'ఎగుమతి చేసినవ'ని, అందువల్ల చట్టబద్ధమైన ధూమపాన వ్యతిరేక హెచ్చరికల నిబంధనల నుంచి వాటికి మినహాయింపు ఉంటుందని డిఎఫ్ఎస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ చేసిన వాదనపై సుప్రీం కోర్టులో కేసు నడుస్తున్నది.
ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో డిపార్చర్ లాంజ్ లోని డిఎఫ్ఎస్ దుకాణంలో సిగరెట్ల నిల్వలను చట్టబద్దమైన హెచ్చరిక లేదన్న కారణంగా కస్టమ్స్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. దీనిని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన ముంబయి హై కోర్టు వెసులుబాటు కల్పించడానికి క్రితం నెల నిరాకరించింది. తరువాత డిఎఫ్ఎస్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. 'ఇవి ఎగుమతి సరకులు. ఎగుమతులకు చట్టబద్ధమైన హెచ్చరికలు పొందుపరచకుండా మినహాయింపు ఉన్నది' అని డిఎఫ్ఎస్ సంస్థ తరఫు న్యాయవాది ముకుల్ రోహతగి సోమవారం వాదించారు.
Pages: 1 -2- News Posted: 9 February, 2010
|