'అసంకల్పిత హంతకుడు' లాస్ ఏంజెలిస్ : సుప్రసిద్ధ పాప్ గాయకుడు మైకేల్ జాక్సన్ ను అసంకల్పితంగా హత్య చేశారనే అభియోగాన్ని డాక్టర్ ముర్రేపై అభియోగాన్ని నమోదు చేశారు. జాక్సన్ మృతికి తాను కారకుడిని కానని ఆయనకు చికిత్స చేసిన డాక్టర్ ముర్రే ఈ సంచలనాత్మక కేసు విచారణ సమయంలో న్యాయస్థానానికి తెలియజేశారు. డాక్టర్ కాన్రాడ్ ముర్రే గ్రే రంగు సూటులో కోర్టుకు హాజరయ్యారు. జాక్సన్ తండ్రి జో, తల్లి కేథరీన్, తోబుట్టువులు లాటోయా, జెర్మెయిన్, టిటో, జాకీ, రాండీ కోర్టు గదిలో ప్రాసిక్యూటర్ల వెనుక సీట్లలో ఆశీనులై ఈ విచారణను తిలకించారు.
కాగా, డాక్టర్ ముర్రే తన న్యాయవాది ఎడ్ చెర్నాఫ్ ద్వారా తన వాదనను వినిపిస్తున్నప్పుడు ఆయన గాని, జాక్సన్ కుటుంబ సభ్యులు గాని ఎటువంటి భావోద్వేగాలనూ ప్రదర్శించలేదు. అయితే, 'మాకు న్యాయం కావాలి' అని జో జాక్సన్ కోర్టు వెలుపల అన్నారు. అంతకుముందు డాక్టర్ ముర్రే లాస్ ఏంజెలిస్ అంతర్జాతీయ విమానాశ్రయం పక్కనే ఉన్న కోర్టు భవనంలోకి వెళ్లడానికి వందలాది మంది విలేఖరులు, జాక్సన్ అభిమానుల ముందుగా సాగినప్పుడు అనేక మంది 'హంతకుడు' అని ఆయనను ఉద్దేశించి అరిచారు.
హూస్టన్ కార్డియాలజిస్ట్ అయిన 56 సంవత్సరాల డాక్టర్ ముర్రే తనపై అభియోగాలు నమోదు చేసిన కొన్ని గంటల తరువాత తన వాదనను వినిపించడం ప్రారంభించారు. నిరుడు జూన్ 25న జాక్సన్ మరణించినప్పుడు ఆయన చెంతే డాక్టర్ ముర్రే ఉన్నారు. అసంకల్పితంగా హత్య చేశారనే అభియోగాన్ని నమోదు చేసిన తరువాత చాలా మందికి నిర్దేశించే మొత్తానికి మూడింతలు అంటే 75 వేల డాలర్లకు డాక్టర్ ముర్రేకు బెయిల్ ను సుపీరియర్ కోర్టు న్యాయమూర్తి కీత్ ఎల్. ష్వార్జ్ మంజూరు చేశారు.
Pages: 1 -2- News Posted: 9 February, 2010
|