వర్శిటీ భూముల కబ్జా హైదరాబాద్ : రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు కుంచించుకుపోతున్నాయి. హైదరాబాద్ నగరంలో చాలా విశ్వవిద్యాలయాల విస్తీర్ణం ఆందోళనకర స్థాయిలో 50 శాతం మేర కుంచించుకుపోయింది. దీనిపై విద్యావేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యావసరాల కోసం ఉద్దేశించిన ఈ ఆస్తిని యాజమాన్యాలు విక్రయించజాలవని వారంటున్నారు. అక్రమ ఆక్రమణలు, చట్టవిరుద్ధంగా విశ్వవిద్యాలయ స్థలాన్ని వేలం వేయడం సంవత్సరాలుగా సాగుతోంది.
ఈ విద్యాలయాల 'అప్పటి' సైజు, 'ఇప్పటి' సైజు తీరుతెన్నులని పరిశీలిస్తే ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఒయు) 1918లో ఏర్పాటైనప్పుడు 2032 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. అది ఇప్పుడు దాదాపు సగానికి తగ్గిపోయింది. విశ్వవిద్యాలయం పేరిట ఇప్పుడు ఉన్న విస్తీర్ణం 1100 ఎకరాలు మాత్రమే. యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ (యుఒహెచ్) 1974లో ఏర్పాటైనప్పుడు విస్తీర్ణం 2322 ఎకరాలు కాగా ఇప్పుడు కేవలం 1021 ఎకరాల స్థలంలో మాత్రమే కార్యకలాపాలు సాగిస్తున్నది.
ఇక విజయవాడలో ఎన్ టిఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసినప్పటి విస్తీర్ణం 30 ఎకరాల నుంచి మూడెకరాలకు తగ్గిపోయింది. వాస్తవానికి విశ్వవిద్యాలయం పని చేయనారంభించినప్పుడు నాలుగు బ్లాకులు ఉండేవి. ఇప్పుడు అది ఒక బ్లాకులో నుంచి పని చేస్తున్నది. మిగిలిన మూడింటినీ కాలేజీగాను, ప్రభుత్వ ఆసుపత్రిగాను ఉపయోగిస్తున్నారు. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయాన్ని 1954లో 960 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేశారు. విశ్వవిద్యాలయం అందులో 150 ఎకరాలను తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి)కి వదలుకున్నది. ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని 1958లో విశాఖపట్నంలో 1500 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. అందులో 250 ఎకరాలు కబ్జాదారుల పరమయ్యాయి.
Pages: 1 -2- News Posted: 12 February, 2010
|