భాగ్యనగరి భద్రమేనా?

హైదరాబాద్ లుంబినీ పార్కులో పేలుడు దృశ్యాలు(ఫైల్ ఫొటో)
__________________________________________
హైదరాబాద్ : టెర్రరిస్టులు బీభత్సం సృష్టించడానికి జర్మన్ బేకరీ వంటి 'తేలిక లక్ష్యాలను' ఎంచుకుంటారని పుణె దాడి మరొకసారి రుజువు చేసింది. కేంద్ర హోమ్ శాఖ మంత్రి పి. చిదంబరం పుణె పేలుడుపై ఆదివారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ, భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఉంటాయి కనుక ఓషో ఆశ్రమం, చబాద్ హౌస్ వంటి 'కఠిన లక్ష్యాలను' వదలి టెరర్రిస్టులు 'తేలిక లక్ష్యాన్ని' ఎంచుకుని ఉండవచ్చునని అన్నారు.
హైదరాబాద్ గడచిన ఐదు సంవత్సరాలలో జంట పేలుళ్లతో సహా పలుసార్లు ఉగ్రవాదుల దాడులకు గురైన సంగతి విదితమే. జంట పేలుళ్లలో అనేక మంది హతులయ్యారు. హైదరాబాద్ నగరంపై టెర్రరిస్టుల కన్ను ఎప్పుడో పడింది. ఇటీవల లష్కర్-ఎ-తయ్యెబా (ఎల్ఇటి) దక్షిణాది ఇన్చార్జి, హూజీ నాయకుడు సయ్యద్ అబ్దుల్ ఖాజా అరెస్టు ఈ అభిప్రాయానికి బలం చేకూరుస్తున్నది. ఖాజాను ఇంటరాగేట్ చేసిన దర్యాప్తు సిబ్బంది యువకులను రిక్రూట్ చేసుకోవడం, 'స్లీపర్ సెల్స్'ను క్రియాశీలకం చేయడం వంటి పనులను అతనికి పురమాయించారని తెలియజేశారు.
Pages: 1 -2- News Posted: 17 February, 2010
|