మృదువుగా క్రూరత్వం కోలకతా : సహజసిద్ధమైన నాయకుడు, తెలివైన యోధుడు, గురితప్పనివాడు, నిర్దాక్షిణ్య హంతకుడు. ఈ లక్షణాలన్నీ వర్తించే 53 ఏళ్ల మీడియాను అభిమానించే గెరిల్లా కిషన్ జీ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పాలిట సింహస్వప్నం కూడా. ఆంధ్ర ప్రదేశ్ లోని ఒక గ్రామంలో మల్లోజుల కోటేశ్వరరావుగా జన్మించిన కిషన్ జీ తన జీవితంలో 34 సంవత్సరాలు అజ్ఞాతంగానే గడిపాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అలుపెరగని, రక్తపాత సమరాన్నే సాగించాడు. బెంగాల్ లో తొలిసారిగా 'టైమ్స్ ఆఫ్ ఇండియా' (టిఒఐ) విలేఖరికి ఇంటర్వ్యూ ఇచ్చిన కిషన్ జీ తాను 93 మంది వ్యక్తులను హతమార్చినట్లు చెప్పుకున్నాడు. అది ఒక ఏడాది క్రితం నాటి మాట. అతను సిల్డాలో సోమవారం జరిగిన మారణకాండకు కూడా సూత్రధారి. అయితే, మృదువుగా మాట్లాడే కిషన్ జీ తానేమీ క్రూర హంతకుడిని కానని చెబుతాడు.
'నా మనస్సు వెన్న. క్షమించి వదలివేయడానికి సుముఖుడిని' అని తనను అభివర్ణించుకునే కిషన్ జీ 'నేను తేలికగా ఎవరినీ చంపను' అని విలేఖరులతో చెబుతుంటాడు. సదా ఎకె-56 తుపాకిని భుజాన ధరించి తిరుగుతుండే, తుపాకి మీట నొక్కేటప్పుడు కళ్లార్పని మనిషి ఇలా చెప్పడం ఆశ్చర్యకరమే. ఒక స్వాతంత్ర్య యోధుని కుమారుడు అతను అని తెలిస్తే మరింతగా ఆశ్చర్యపోవలసి వస్తుంది. ఎమర్జన్సీ విధించిన తరువాత ఒక సంవత్సరానికి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన తిరుగుబాటుదారుడు సిపిఐ (ఎంఎల్) నాయకులతో సంబంధాలు ఏర్పరచుకున్నాడు. 1980లో అతను ఆంధ్ర ప్రదేశ్ లో పీపుల్స్ వార్ కు సహ వ్యవస్థాపకుడు. అతను పొలిట్ బ్యూరో సభ్యుని స్థాయి నుంచి ఎదిగి తన స్వస్థలం తెలంగాణ ప్రాంతంలోను, దండకారణ్యంలోను తమ సంస్థ కార్యకలాపాలకు ఇన్ చార్జిగా వ్యవహరించాడు.
Pages: 1 -2- News Posted: 17 February, 2010
|