రోశయ్యకు 'వాస్తు' రక్ష హైదరాబాద్ : చివరకు ఆయన రెండు చేతులు జోడించి దేవుని సహాయాన్ని ఆర్థిస్తున్నారు. దేశంలో రోజూ కోట్లాది మంది ప్రజానీకం దేవుడిని వేడుకుంటారు. కానీ ఇక్కడ వేడుకుంటున్నది ఏ సామాన్య అభాగ్యుడో కాదు, సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య. విధి అనుకూలించడం లేదంటూ ఆయన ఇపుడు దేవుడిని ఆశ్రయించారు. ముఖ్యమంత్రి పీఠం అధిష్టించినది మొదలు వరదలు, తెలంగాణ ఉద్యమాలు రూపంలో రాష్ట్రంలో నిత్యం అశాంతి రగులుతూనే ఉంది. అంతేగాక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహకరించకపోవడం, చివరకు అధికారులు కూడా తన మాటను లెక్క చేయకపోవడాన్ని గమనించిన రోశయ్య ఇక గత్యంతరం లేని పరిస్థితిలో దేవుని శరణు కోరారు.
తాను ఈ కష్టాల నుంచి గట్టెక్కడానికి, ముఖ్యమంత్రి కుర్చి కదలకుండా ఉండటానికి ఏం చేయాలో సూచించమంటూ వాస్తు పండితులను, సిద్ధాంతులను, పంచాంగకర్తలను రోశయ్య వేడుకున్నారు. ఈ మేరకు జనవరి నెలలో క్యాంపు కార్యాలయాన్ని పండితులు సందర్శించారు. బేగంపేటలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వాస్తు దోషాలను సవరించడం ద్వారా ముఖ్యమంత్రి శక్తివంతంగా పని చేయగలరని పండితుల పవిత్ర సలహా ఇచ్చారు. తెలుగు కొత్త సంవత్సరం ఉగాది పర్వదినంలోగా దోషాలు సవరించిన క్యాంపుకార్యాలయానికి నివాసం మారాలని, ఆ తరువాత ముఖ్యమంత్రి గతి మారుతుందని పండితులు సలహాలో వివరించారు. దీంతో ఇపుడు క్యాంపు కార్యాలయం రోశయ్య ను పొలిటికల్ గా పవర్ ఫుల్ చేసే విధంగా కొత్త రూపు సంతరించుకుంటోంది.
Pages: 1 -2- News Posted: 18 February, 2010
|