సామరస్యమా? సమరమా? మిడ్నపూర్ : కేంద్రం ఒక వైపు 'ఆపరేషన్ గ్రీన్ హంట్'కు సన్నద్ధం అవుతుంటే, మరొక వైపు మావోయిస్ట్ అగ్ర నాయకులు పశ్చిమ బెంగాల్ లోని లాల్ గఢ్ కు సుమారు 40 కిలో మీటర్ల దూరంలో ఒక రహస్య స్థావరంలో చర్చలు సాగిస్తున్నారు. ప్రభుత్వంతో చర్చలకు అంగీకరించాలా లేక పోరు కొనసాగించాలా అనేది తేల్చుకోవడానికి వారు ప్రయత్నిస్తున్నారు. రెండు రోజుల పాటు మేధోమథనం సాగించిన తరువాత కూడా వారు ఏకాభిప్రాయానికి రాలేకపోయారు.
బెంగాల్ లు కిరాతక హత్యలకు బాధ్యుడైన సైనిక వ్యూహకర్త కిషన్ జీ ప్రభుత్వ బలగాలతో పోరు సాగించవలసిందేనని పట్టుబట్టుతుండగా సిపిఐ (మావోయిస్ట్) కేంద్ర కమిటీలో గోపీనాథ్ జీ అలియాస్ దుర్గా హెంబ్రమ్ నాయకత్వంలోని మరొక బలమైన వర్గం సాధ్యమైనంత త్వరలో ప్రభుత్వంతో చర్చలు జరపాలని కోరుతున్నది.
కాల్పుల విరమించి చర్చలకు రావలసిందని లేదా పెద్ద ఎత్తున విరుచుకుపడతామని అంటూ కేంద్రం విధించిన షరతు మావోయిస్టులను తీవ్ర గుంజాటనకు గురి చేసిందని, వివిధ క్రియాశీలక మండలాలకు చెందిన అగ్రశ్రేణి నాయకులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్నది. సిపిఐ (మావోయిస్ట్) కేంద్ర కమిటీలోని 36 మంది సభ్యులలో బీహార్, ఝార్ఖండ్, ఒరిస్సా రాష్ట్రాల సభ్యులతో సహా సుమారు 30 మంది కనాయిషోల్ పర్వతారణ్యంలో ఈ సమావేశంలో పాల్గొంటున్నట్లు గూఢచారి విభాగం అధికారి ఒకరు తెలిపారు. కోలకతాకు 200 కిలో మీటర్ల దూరంలో బెంగాల్ - ఝార్ఖండ్ సరిహద్దులో గల ఈ ప్రదేశం ఒకప్పుడు విహార యాత్రా కేంద్రం.
Pages: 1 -2- News Posted: 22 February, 2010
|