పట్టాలెక్కిన మెట్రో బిడ్స్ హైదరాబాద్ : ఏకంగా 12,132 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే హైదరాబాద్ మెట్రో రైల్ (హెచ్ఎంఆర్) ప్రాజెక్ట్ కోసం పోటీలో ఉన్న ఎనిమిది కన్సార్షియాలు, సంస్థలను ఆర్థిక బిడ్ ల సమర్పణకు అర్హమైనవిగా తేల్చారు. అవి ఏప్రిల్ 21 లోగా ఆర్థిక బిడ్ లను సమర్పించవలసి ఉంటుంది. షార్ట్ లిస్ట్ చేసిన ఎనిమిది కంపెనీల పేర్లను పురపాలక, పట్టణాభివృద్ధి (ఎంఎయుడి) శాఖ విడుదల చేసింది. ఆ సంస్థల పేర్లు : ట్రాన్స్ స్ట్రాయ్ - ఒజెఎస్ సి ట్రాన్స్ స్ట్రాయ్ - సిఆర్ 18జి - బిఇఎంఎల్ కన్సార్షియం, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ - రిలయన్స్ ఇన్ఫోకామ్, లాంకో ఇన్ఫ్రాటెక్ - ఒహెచ్ఎల్ కన్సెషన్స్ ఎస్ఎల్, ఎస్సార్ - లైటన్ - గాయత్రి - విఎన్ఆర్ కన్సార్షియం, జిఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, జివికె - శామ్సంగ్ సి అండ్ టి కార్పొరేషన్, సోమా - స్ట్రాబాగ్ ఎజి (ఆస్ట్రియా), లార్సన్ అండ్ టూబ్రో లిమిటెడ్.
డిజైన్, నిర్మాణం, ఆర్థిక వనరులు, నిర్వహణ, బదలీ ప్రాతిపదికపై మెట్రో రైల్ ప్రాజెక్టును హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ చేపట్టుతున్నది. బిడ్ లను ఆహ్వానిస్తూ అర్హత కోసం అభ్యర్థన (ఆర్ఎఫ్ క్యూ)కి 2009 జూలైలో పిలుపు ఇచ్చారు. కాని అనేక కారణాలతో బిడ్ ల సమర్పణకు గడువును సెప్టెంబర్ 15 నుంచి నాలుగు సార్లు పొడిగించారు. తమ ఆర్థిక బిడ్ లను సమర్పంచేందుకు ఎనిమిది కన్సార్షియంలకు ప్రతిపాదన కోసం అభ్యర్థన (ఆర్ఎఫ్ పి) పత్రాలను హెచ్ఎంఆర్ ఈ నెల 24 నుంచి పంపనారంభిస్తుంది.
Pages: 1 -2- News Posted: 24 February, 2010
|