ఐపీఎల్ 'పరీక్ష'లు హైదరాబాద్ : మార్చి నెలంటే విద్యార్థులకు హడల్ . ఎందుకంటే ఈ నెలలోనే పరీక్షలు దండెత్తుతాయి కాబట్టి. ఇందులో వెరైటీ ఏముందనుకుంటున్నారా.. కచ్చితంగా ఉంది. విద్యార్థులకే కాదు తల్లితండ్రులకు కూడా ఇప్పుడు మార్చి నెలంటే దడ పుడుతోంది. ఇటు విద్యార్థులకు, అటు విద్యార్థులకు కూడా ఈ సారి మార్చి నెల పరీక్షా కాలంగా మారిపోయింది. విద్యార్థులకు సబ్జెక్టులు పరీక్ష పెడుతుండగా, వారి తల్లితండ్రులకు మాత్రం ఇండియన్ ప్రీమియర్ లీగ్ విషమ పరీక్షను పెడుతోంది. ఒక వైపు భవిష్యత్తును నిర్దేశించే వార్షిక పరీక్షలు వస్తున్నాయి అదే సమయంలో అమితంగా ఇష్టపడే ఐపీఎల్ మ్యాచ్ లు కూడా వస్తుండటంతో విద్యార్థుల వారి తల్లితండ్రలు కలసి ఒకేసారి అసలుసిసలు పరీక్షను ఎదుర్కొంటున్నారు.
ఈ పరీక్షల నుండి గట్టేక్కేందుకు విద్యార్థులు, తల్లితండ్రులు అష్టకష్టాలు పడాల్సివస్తోంది. దీనిలో భాగంగా పిల్లలని పరీక్షలకు ప్రిపేర్ చేసేందుకు విద్యార్ధుల తల్లితండ్రులు పలు జాగ్రత్తలు తీసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఐపీఎల్ వైపు పిల్లల దృష్టి మరలకుండా వారి తల్లితండ్రులు చివరకు త్యాగాలు చేస్తున్నారు. తాము ఎంతో ఇష్టంగా చూసే ఐపీఎల్ క్రికెట్ ను చూడరాదని చాలామంది తల్లితండ్రులు తీర్మానించుకున్నారు. ఈ మ్యాచ్ లు జరిగే సమయంలో టీవీలను ఇంట్లో ఆన్ చేయరాదని ధృఢమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ మ్యాచ్ లు జరిగేటపుడు తాము ఇంట్లో వేరే ప్రత్యామ్నాయ వ్యాపకాలు చేసుకోవాలని ప్రణాళికను సిద్ధం చేసారు.
Pages: 1 -2- News Posted: 25 February, 2010
|