మళ్లీ అశోకుని శకం! హైదరాబాద్ : ఝాన్సీ రాణి 1954లో దేశం చేరుకున్నది. అశోక చక్రవర్తి 1971 ఏప్రిల్ లో ఇండియాలోకి ప్రవేశించాడు. మొగల్ యువరాణి 1948లో బొంబాయిలోకి అడుగుపెట్టింది. ఇవి చరిత్రను వక్రీకరించే వాస్తవాలు కావు. టాటా ఎయిర్ లైన్స్ ను ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా 1946లో మార్చిన తరువాత ఎయిర్ ఇండియా విమానాలలో చేరిన కొన్ని విమానాల పేర్లు ఇవి. అంతే.
ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న ఐదు రోజుల ద్వితీయ పౌర విమానయాన ఎగ్జిబిషన్ 'ఇండియా ఏవియేషన్ 2010'లో భాగంగా 'మైల్ స్టోన్స్ ఆఫ్ వరల్డ్ ఏవియేషన్' (ప్రపంచ విమానయాన రంగంలో మైలురాళ్లు) అనే అంశంపై ఏర్పాటు చేసిన పెవిలియన్ లో ఎయిర్ ఇండియా సంస్థ ఆవిర్భావాన్ని, 78 ఏళ్ల చరిత్రను విశదంగా తెలియజేసే పలు అంశాలలో ఇవీ ఉన్నాయి.
ఖాయిలా పడిన ప్రభుత్వ విమాన సంస్థగా ఎక్కువగా వార్తలలోకి ఎక్కుతున్నా లేక పేరుకుపోతున్న నష్టాలకు, విమాన సర్వీసుల జాప్యాలకు పేరొందుతున్నా ఎయిర్ ఇండియా బోయింగ్ 707-337సి విమానం బోయింగ్ విమానాలన్నిటిలోకి వేగంలో కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పిన సందర్భం ఒకటి ఉందని ఈ ఎగ్జిబిషన్ ను సందర్శించేవారు తెలుసుకోవచ్చు. ఆ విమానం లండన్ నుంచి ఏకబిగిన ప్రయాణం సాగించి కేవలం ఏడు గంటల 54 నిమిషాలలో బొంబాయికి చేరుకున్నది.
Pages: 1 -2- News Posted: 6 March, 2010
|