ఒరిస్సాలో 'అవతార్'
లాంజిఘడ్: హాలీవుడ్ రికార్డులను తిరగరాసిన అవతార్ సినిమా కథ ఒరిస్సాలో ఇప్పుడు జరుగుతోంది. ప్రకృతి ఒడిలో బతుకుతూ, చెట్లనే ఆవాసంగా చేసుకుని డోంగ్రియా తెగకు చెందిన గిరిజనులు ఇక్కడ నివసిస్తున్నారు. ఆ అడవుల్లోనే అత్యంత విలువైన ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. అపారమైన ఖనిజ వనరులపై మైనింగ్ కంపెనీలు కన్నేసి వాటిని చేజిక్కుంచుకోవడానకి ప్రయత్నిస్తున్నాయి. డోంగ్రియా గిరిజనలు తిరగబడతున్నారు. బతుకు కోసం పోరాడుతున్నారు. అచ్చంగా. 'అవతార్' సినిమా పండోరా తెగ ప్రజానీకానికి మైనింగ్ మాఫియాకి మధ్య సాగిన యుద్ధమే కదా. దేశంలోని విలువైన ఖనిజ నిక్షేపాలకు కేంద్రమైన ఒరిస్సాలో కూడా సరిగ్గా ఇదే జరుగుతోంది.
ఇక్కడి గిరిజనలకు లండన్ కు చెందిన వేదాంత రిసోర్సెస్ కంపెనీ మద్య సాగుతున్న యుద్ధం అవతర్ కథనాన్నే పోలి ఉంటుంది. ఒరిస్సాలోని నియామ్ గిరీ పర్వతశ్రేణుల్లో నిక్షేపమైన బాక్సైట్ ఖనిజవనరులను సొంతం చేసుకోవాలని వేదంతా కంపెనీ యత్నిస్తోంది. అయితే ఈ కంపెనే చేపట్టే తవ్వకాల కారణంగా తమ జీవితాలు నాశనం అవుతాయని, బ్రతుకు తెరువు కోల్పొతామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో గిరిజన తెగ ప్రజానీకానికి వేదాంతా కంపెనీకి మధ్య యుద్ధం సాగుతోంది. అవతార్ సినిమాలోని కథనం ఒరిస్సాలోని నియామ్ గిరి పర్వేతశ్రేణుల్లో వాస్తవరూపం దాల్చిందని సర్వైవల్ ఇంటర్నేషనల్ అనే బ్రిటీష్ చారిటీ సంస్థ డైరక్టర్ స్టీఫెన్ అభివర్ణించారు. అవతార్ సినిమాలో నవి తెగ ఎదురుకొన్నట్లే ఒరిస్సాలో డోంగ్రియా జాతి కూడా ఇప్పుడు తీవ్రమైన ఇబ్బందుల్లో చిక్కుకున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
గిరిజనల హక్కులను దోచుకోవడం లేదని వేదంత సంస్థ చెప్పుకొస్తుంది. తాము చట్టం ప్రకారమే బాక్సైట్ ప్రాజెక్టును చేపడుతున్నట్లు వేదాంత అల్యూమినా రిఫైనరీ సీఈఓ ముఖేశ్ వాదిస్తున్నారు. గిరిజనులు అభివృద్ధిని కోరుకోవడం లేదని, వారి పిల్లలు కేవలం స్కూలుకు వెళ్లడం, తినడానికి ఎంతో కొంత ఉంటే చాలు అనుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తాము బాక్సైట్ ప్రాజెక్టును చేపడితే గిరిజనులకు ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయని, ఆ ప్రాంతాన్ని ఎంతగానో అభివృద్ధి చేస్తామని చెప్పుకున్నారు.
Pages: 1 -2- News Posted: 6 March, 2010
|