మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా)
ఆదాయం : 8, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 2
ఈ రాశి వారికి మే 1 వరకు జన్మరాశి మకరంలోనూ, తదుపరి ద్వితీయమైన కుంభం, తిరిగి జూలై 30 నుండి డిసెంబరు 19 వరకు వక్రగతిన మకరం, తదుపరి ద్వితీయమైన కుంభరాశిలో సంచరిస్తాడు. శని సెప్టెంబర్ 9 వరకు అష్టమ స్థానం సింహం, తదుపరి భాగ్యస్థానం కన్యారాశి యందు సంచారం. రాహు, కేతువులు నవంబర్ 19 వరకు జన్మరాశిలోనూ, సప్తమ స్థానం కర్కాటకం, తదుపరి వ్యయస్థానమైన ధనుస్సు, షష్ఠమస్థానం మిధునంలోనూ సంచారం.
ఈ రాశి వారికి శని, రాహువుల స్థితి ప్రతికూలం. గురు బలం బాగుంది. మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పనులు నిదానంగా సాగుతాయి. ఆదాయ, వ్యయాలు సమానస్థాయిలో ఉంటాయి. కుటుంబసభ్యులతో మాట పట్టింపులు ఏర్పడతాయి. స్థిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. కొన్ని వ్యవహారాలలో మోసాలకు గురి కాగల అవకాశం. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. విద్యార్ధులకు శ్రమానంతరం ఫలితాలు దక్కుతాయి. నిరుద్యోగులు ప్రధమార్ధంలో ఉద్యోగలాభం పొందుతారు. పారిశ్రామిక వేత్తలకు కొంత అనుకూల స్థితి. వ్యవసాయదారులకు రెండవ పంట లాభిస్తుంది. సాంకేతిక, పరిశోధనా రంగాల వారికి కొన్ని అవరోధాలు తొలగుతాయి. కాంట్రాక్టర్లకు లాభిస్తుంది. కళాకారులకు యోగదాయకంగా ఉంటుంది. భూములు వాహనాలు కొంటారు. అవివాహితులకు వివాహయోగ కాలం. వీరు నవగ్రహ స్తోత్రం, హనుమాన్ చాలీసా పఠించాలి.
అదృష్ట సంఖ్య 8
అనుకూల సంఖ్యలు 4,5,9
నీలం ధరించడం మంచిది.
చైత్రం : అధిక బాధ్యతలు, శ్రమాధికం, అనారోగ్యం, శుభకార్యాలలో పాల్గొంటారు. వాహన సౌఖ్యం.
వైశాఖం : వివాహాది శుభకార్యాలు, సన్నిహితులతో సఖ్యత, ఆర్ధికాభివృద్ధి, పనులలో అనుకూలం.సంఘంలో గౌరవం.
జ్యేష్ఠం : వ్యాపార వృద్ధి, పనులలో విజయం, వాహనయోగం. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం.
ఆషాఢం : అన్నింటా విజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు. పెట్టుబడులలో లాభాలు. కొత్త పరిచయాలు.
శ్రావణం : యత్న కార్యసిద్ధి. వ్యాపారాలలో పురోగతి. ఇంటాబయట ప్రోత్సాహం. విందు వినోదాలు.
భాద్రపదం : వృధా ఖర్చులు. వ్యవహారాలు మందగిస్తాయి, శ్రమాధికం, కుటుంబంలో చికాకులు, అనారోగ్యం.
ఆశ్వయుజం : కుటుంబంలో శుభకార్యాలు. కొత్త పనులకు శ్రీకారం, ప్రముఖుల పరిచయం, ఉద్యోగ వాహన లాభాలు.
కార్తీకం : వృత్తి, వ్యాపారాలలో పురోగతి, ప్రయాణాలు లాభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. బంధువుల కలయిక శుభకార్యాల రీత్యా ధనవ్యయం.
మార్గశిరం : అన్నిటా అభివృద్ధి. ధన వస్తులాభాలు. ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అందరిలోనూ గుర్తింపు.
పుష్యం : అధికారుల మన్ననలు పొందుతారు. ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పాతమిత్రులను కలుస్తారు. స్థిరాస్తి వృద్ధి.
మాఘం : ప్రోత్సాహకరమైన వాతావరణం. ఆర్ధిక, వస్తు లాభాలు. విలాసవంతంగా గడుపుతారు. శ్రమకు ఫలితం దక్కుతుంది.
ఫాల్గుణం : కొత్త ఉద్యోగ లాభం. ప్రముఖుల నుండి ముఖ్య సమాచారం. పెట్టుబడులు లాభిస్తాయి. సోదరుల నుంచి ఆస్తి లాభ సూచనలు.
|