TeluguPeople
  are the trend-setters
 
Astrology: Weekly and Yearly Predictions by Sign

March 2009 - March 2010 rASi falAlu

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా) ఆదాయం - 11, వ్యయం - 5, రాజపూజ్యం - 6, అవమానం - 3 ఈ రాశి వారికి గురుడు మే 1 వరకు షష్ఠమ స్థానం మకరం, తదుపరి సప్తమ స్థానం కుంభంలోనూ, తిరిగి జూలై 30 నుండి వక్రగతిన మకరం, అనంతరం డిసెంబర్ 19 నుండి కుంభరాశి యందు సంచారం. శని సెప్టెంబర్ 9 వరకు జన్మరాశిలోనూ తదుపరి ద్వితీయమైన కన్యారాశి యందు సంచారం. రాహు, కేతువులు నవంబర్ 19 వరకు షష్ఠమ స్థానం మకరం, వ్యయస్థానం కర్కాటకం, తదుపరి పంచమ స్థానం ధనుస్సు, లాభస్థానమైన మిధున రాశియందు సంచారం. ఈ రాశి వారికి ఏల్నాటి శని ప్రభావం అధికంగా ఉన్నందున గురుబలం తక్కువగా ఉన్నందున సామాన్యంగా ఉంటుంది. తరచూ ఆరోగ్య, ఆర్థిక సమస్యలు చికాకు పరుస్తాయి. శ్రమాధికం. పనులలో ఒత్తిడిలు పెరుగుతాయి. కోర్టు వ్యవహారాలు ఆందోళన కలిగించవచ్చు. మిత్రులు శత్రువులుగా మారతారు. కొత్త రుణాలు లేదా స్థిరాస్తి విక్రయాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారాలు మందగిస్తాయి. లాభనష్ఠాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగులకు స్థానచలనం. వ్యవసాయదారులు పెట్టుబడులు సకాలంలో అందక ఇబ్బందిపడతారు. పంటలు కూడా నిరాశ పరుస్తాయి. నిరుద్యోగులకు, విద్యార్థులకు శ్రమానంతరం ఫలితం ఉంటుంది. కాంట్రాక్టర్లకు నిరాశే మిగులుతుంది. పారిశ్రామిక, సాంకేతిక, వైద్యరంగాల వారికి తగిన గుర్తింపు లభించదు. కళాకారులు అవకాశాల కోసం తాపత్రయపడతారు. రాజకీయ వేత్తలకు ప్రజాదరణ లోపిస్తుంది. ఉదరం, నరాల సంబంధ వ్యాధులు బాధించవచ్చు. వీరు శనికి తైలాభిషేకాలు, రుద్రాభిషేకాలు చేయించుకోవాలి, ఆదిత్య హృదయం పఠించాలి. అదృష్ట సంఖ్య 1 అనుకూల సంఖ్యలు 2, 3, 9 వీరు కెంపు ధరించవచ్చు. చైత్రం : కార్యాలలో జాప్యం, మిత్రుల సహకారంతో ముందడుగు వేస్తారు, సంతాన, కుటుంబసౌఖ్యం, ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. వైశాఖం : శుభకార్యాల గురించి ప్రస్తావన, బంధు, మిత్రుల కలయిక, రుణాలు కొంత తీరతాయి, సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. జ్యేష్ఠం : వాహనాల విషయంలో అప్రమత్తత అవసరం. ఆర్థిక ఇబ్బందులు. పనులలో నిరాశ. మిత్రులతో విరోధాలు. ఆరోగ్య భంగం. ఆషాఢం : కుటుంబ కలహాలు, మనశ్శాంతి లోపిస్తుంది, పనులలో ఆటంకాలు, వివాదాలు, తీర్థయాత్రలు. శ్రవణం : బంధు, మిత్రుల సహకారం, ఆకస్మిక ప్రయాణాలు, కొత్త వస్తు, వస్త్రలాభాలు, కుటుంబంలో శుభకార్యాలు. భాద్రపదం : రుణవత్తిడులు, ఇంటాబయటా సమస్యలు, ప్రయాణాలలో ఆటంకాలు, వ్యయప్రయాసలు, వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. ఆశ్వయుజం : వ్యాపారాలలో ఒడిదుడుకులు, అనుకోని ఖర్చులు, భూ సంబంధ వివాదాలు, అనారోగ్యం, మానసిక ఆందోళన. కార్తీకం : వ్యాపారాలలో స్వల్పలాభాలు, సోదరుల నుంచి శుభవార్తలు, అనారోగ్యం, బంధువులతో స్వల్ప విభేదాలు. మార్గశిరం : నెలారంభంలో అనుకూలత, ఆర్థిక వృద్ధి, కుటుంబంలో శుభకార్యాలు, ప్రముఖులతో పరిచయాలు, పెట్టుబడులు అందుతాయి. పుష్యం : వ్యాపారాల్లో సామాన్యంగా ఉంటుంది. వివాదాలు కొన్ని పరిష్కారం, పాత బాకీలు వసూలవుతాయి, శ్రమాధికంతో వ్యవహారాలు పూర్తి. మాఘం : వృత్తి, వ్యాపారాలలో వత్తిడులు, వృధా ఖర్చులు, ఆకస్మిక ప్రయాణాలు, ఆరోగ్య భంగం, కొత్త సంస్థల ప్రారంభం. ఫాల్గుణం : వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి, శ్రమాధికం, కుటుంబంలో చికాకులు, పరిస్థితులు అనుకూలించవు.

Subham&astu


mI rASiphalAlu telusukunEMduku

mI rASi gurtupei klik` chEyaMDi


Aries Taurus Gemini Cancer Leo Virgo
Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces




News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2023 TeluguPeople.com, All Rights Reserved.

 
SAS Training