TeluguPeople
  are the trend-setters
 
Astrology: Weekly and Yearly Predictions by Sign

March 2009 - March 2010 rASi falAlu

తుల (చిత్త 3, 4పా, స్వాతి, విశాఖ 1, 2, 3పా) ఆదాయం - 11, వ్యయం - 2, రాజ్యపూజ్యం - 5, అవమానం - 6 ఈ రాశి వారికి గురుడు మే 1 వరకు చతుర్థస్థానమైన మకరం, తదుపరి పంచమస్థానమైన కుంభంలోనూ తిరిగి జూలై 30 నుండి వక్రగతిలో మకర రాశియందు, డిసెంబర్ 19 నుండి కుంభరాశిలో సంచారం. శని సెప్టెంబర్ 9 వరకు లాభస్థానమైన సింహంలోనూ, తదుపరి వ్యయస్థానమైన కన్యారాశి యందు సంచారం. రాహు, కేతువులు నవంబర్ 19 వరకు చతుర్ధస్థానమైన మకరంలోనూ, దశమస్థానం కర్కాటకంలోనూ తదుపరి తృతీయ స్థానమైన ధనుస్సు, భాగ్యస్థానం మిథునంలోనూ సంచారం. ఈ రాశి వారికి సెప్టెంబర్ నుండి ఏల్నాటి శని ప్రారంభమవుతుంది. గురుబలం సామాన్యం. వీరికి ఈ ఏడాది ఆశా నిరాశల మధ్య సాగుతుంది. రాబడి వచ్చినా ఖర్చులు కూడా సమానంగా ఉంటాయి. వ్యవహారాలలో మధ్యవర్తిత్వం వద్దు. కుటుంబ సభ్యులతో తరచూ విభేదాలు ఏర్పడతాయి. ఆలోచించి మరీ నిర్ణయాలు తీసుకోవడం మంచిది. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. వాహనాల విషయంలో అప్రమత్తత అవసరం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధిక వత్తిడులు, అధికారులతో వివాదాలు నెలకొంటాయి. బదిలీ అవకాశాలు కూడా ఉంటాయి. విద్యార్థులకు ఫలితాలు కాస్త నిరాశ పరుస్తాయి. నిరుద్యోగులకు ప్రథమార్థంలో ఉద్యోగావకాశాలు. వ్యవసాయదారులకు పంటలు అనుకూలిస్తాయి. కళాకారులకు అవకాశాలు లభించినా సంతృప్తికరంగా ఉండవు. కాంట్రాక్టర పరిస్థితి కొంత అగమ్యగోచరంగా ఉంటుంది. సాంకేతిక, పరిశోధనా రంగాలలోని వారికి ఊపిరి పీల్చుకునే పరిస్థితులు నెలకొంటాయి. స్థిరాస్తి వివాదాలు, ఒక ముఖ్యమైన కోర్టు వ్యవహారం పరిష్కారం కాగల సూచనలు. శివపంచాక్షరి, ఆదిత్యహృదయం, కనకధారాస్తోత్రం పఠించాలి. అదృష్ట సంఖ్య 6, అనుకూల సంఖ్యలు 5, 7 వీరు వజ్రం ధరించవచ్చు. చైత్రం : వ్యాపారాలలో ఒడిదుడుకులు, ధననష్టం, ఆరోగ్య సమస్యలు, బంధు విరోధాలు, ప్రయాణాలు. వైశాఖం : శుభకార్యాలు, ఆర్థికవృద్ధి, భూ, గృహ యోగాలు, అవార్డులు, రివార్డులు అందుతాయి. జ్యేష్ఠం : మానసిక ప్రశాంతత, పెట్టుబడులు అందుతాయి. విందు, వినోదాలు, ఉద్యోగులకు పదోన్నతులు, వాహనసౌఖ్యం. ఆషాఢం : ఆకస్మిక ప్రయాణాలు, వృధాఖర్చులు, అనారోగ్యం, కుటుంబంలో చికాకులు, పనులు వాయిదా. శ్రావణం : వ్యాపారాలలో వృద్ధి, కుటుంబంలో శుభకార్యాలు, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, కొత్త పరిచయాలు. భాద్రపదం : పనులలో జాప్యం, ఆర్థిక ఇబ్బందులు, రుణాలు, చేస్తారు, ప్రయాణాలలో ఆటంకాలు, స్థానచలనం. ఆశ్వయుజం : రుణబాధలు, పనులలో ఆటంకాలు, బంధు మిత్రులతో వైరం, ఆరోగ్య, కుటుంబ సమస్యలు. కార్తీకం : వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. రుణాలు తీరతాయి. పనులలో విజయం, కొత్త ఒప్పందాలు. మార్గశిరం : ఆర్ధికాభివృద్ధి, సంఘంలో గౌరవం, కీలక నిర్ణయాలు, పోటీ పరీక్షలలో విజయం, ఉద్యోగ లాభం. పుష్యం : వ్యాపారాలలో లాభాలు, పదోన్నతులు, బదిలీలు, తీర్థయాత్రలు, గృహనిర్మాణయత్నాలు. మాఘం : చేపట్టిన కార్యక్రమాలు వాయిదా, శ్రమాధికం, అనారోగ్యం, శత్రువృద్ధి, వ్యాపారాలలో ఆటుపోట్లు. ఫాల్గుణం : శ్రమాధికంతో పనులు పూర్తి, ఆరోగ్య సమస్యలు తీరతాయి, ధన, వస్తులాభాలు, విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు.

Subham&astu


mI rASiphalAlu telusukunEMduku

mI rASi gurtupei klik` chEyaMDi


Aries Taurus Gemini Cancer Leo Virgo
Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces




News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2023 TeluguPeople.com, All Rights Reserved.

 
SAS Training