నిజామాబాద్ : జిల్లాలో సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం సంభవించింది. కమ్మరిపల్లి వద్ద జాతీయ రహదారిపై పేపరు వ్యాను చెట్టును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.