నిజామాబాద్ : జిల్లాలోని ఔత్యాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించి వారికి చేయూతనందించాలని నిర్ణయించినట్లు జిల్లా కలెక్టర్ సునీత చెప్పారు. ఈ మేరకు జిల్లా పరిశ్రమల అభివృద్ధి మండలి నిర్ణయం తీసుకున్నట్లు ఆమె చెప్పారు. 2010-11 ఆర్థిక సంవత్సరంలో సుమారు 200 మందిని ప్రోత్సహించేందుకు 49 కోట్ల రూపాయలు కేటాయించినట్లు ఆయన చెప్పారు. తద్వారా ఉపాధి అవకాశాలు కూడా జిల్లాలో మెరుగుపడతాయని ఆమె వివరించారు.