నిజామాబాద్ : పాఠశాల విద్యార్థుల విహారయాత్రలో విషాదం నెలకొంది. పిక్ నిక్ కు వెళ్లున్న స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. డోనకల్ వద్ద ఈ బస్సు సోమవారం తెల్లవారుజామున అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ దుర్ఘటనలో ఇద్దరు ఉపాధ్యాయులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. మృతులు అదిలాబాద్ జిల్లా కడెం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు. క్షతగాత్రులను108లో సమీప ఆసుపత్రికి తరలించారు.