ఎన్ సి సి పరీక్షకు విశేష స్పందన
నిజామాబాద్ : జిల్లాలో నిర్వహించిన ఎన్ సి సి పరీక్షకు విద్యార్థుల నుండి విశేష స్పందన లభించింది. ఈ పరీక్షకు అదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ పరీక్షకు 1006 మంది విద్యార్థులు హాజరయ్యారని, వారిలో 787 మంది బాలురు, 219 మంది బాలికలు ఉన్నట్లు ఎన్ సి సి అధికారి కల్నల్ సురేష్ కుమార్ చెప్పారు.
News Posted: 22 February, 2010
|