ముందుచూపే ముఖ్యం
మొన్నటి ఐదో వన్డే మ్యాచ్ లో కొత్త వాళ్లకి అవకాశమిచ్చి, ఏదో ప్రయోగాలు చేశామన్న పేరుతో సిరీస్ క్లీన్ స్వీప్ ను చేజార్చుకోవడం ఎంతవరకూ సబబని ప్రశ్నించిన వాళ్లూ లేకపోలేదు. అడిగేవాడికి చెప్పేవాడు లోకువన్నట్టు, ప్రశ్న బాగానే వుంది గాని ఐదు మ్యాచ్ లో సిరీస్ లో నాలుగు గెలుచుకున్నాక కూడా ప్రయోగాలు చేయకపోతే, మరెప్పడు కొత్తవాళ్లకి అవకాశాలు మరెప్పుడు లభిస్తాయి? రిజర్వు ఆటగాళ్లుగానే వాళ్లని కొనసాగిస్తూ రిటైర్ చేసేయడం సమంజసమా? మామూలుగా ఆరుగురు బ్యాట్స్ మెన్, ఒక వికెట్ కీపర్, నలుగురు స్పెషలిస్ట్ బౌలర్లు విధిగా కలిగివుండే భారత జట్టుకు, ఇంతవరకూ కపిల్ దేవ్, మనోజ్ ప్రభాకర్, రవిశాస్త్రి లాంటి సమర్ధుడైన ఆల్ రౌండర్ దొరక్కపోవడం దురదృష్టం. ప్రస్తుతం అలాంటి ఆటగాడి కోసమే అన్వేషణ కొనసాగుతోంది. అటు సమర్ధవంతంగా బౌలింగ్ చేస్తూ ప్రత్యర్ధి బ్యాట్స్ మెన్ ను కట్టడిచేయడం, మరోవైపు బ్యాటింగ్ లో రాణించి గణనీయమైన స్కోర్లు సాధించడం ఈ ఆల్ రౌండర్ బాధ్యత.
ఈ నేపథ్యంలో అనవసరమైన ప్రయోగాలు చేశారంటూ వచ్చే అనవసరమైన అభియోగాలు చికాకు కలిగిస్తాయి. ఒక వన్డే మ్యాచ్ లో ఓడిపోయినందు వల్ల జట్టు రాంకింగ్ తగ్గిపోయింది. నిజమే! అయితే వరల్డ్ కప్ లక్ష్యంగా జట్టు తయారవుతున్నప్పుడు ఈ గణాంకాలు అవసరమా? ఏ ఆటగాడు ఏ మ్యాచ్ లో రాణించి ఎటువంటి విజయసోపానాలకు పునాది వేస్తాడో ఎవరు చెప్పగలరు? అందువల్ల అవసరమైనప్పుడు అందరికీ, ముఖ్యంగా కొత్తవాళ్లకి ఆడే అవకాశం ఇవ్వాల్సిందే.
Pages: -1- 2 News Posted: 9 February, 2009
|