'సివిల్స్' పాసైన రేపిస్ట్!
రాయ్ కెమిస్ట్రీ పాఠాలు బోధిస్తుండేవాడు. అతను 2003లో సుస్మితకు ఎక్స్ ట్రా క్లాసులు తీసుకునేవాడుు. ఆమె ఆత్మహత్య పత్రం ప్రకారం, ఒక కోచింగ్ సెషన్ లో ట్యూటర్ ఆమెను మాదకద్రవ్య ప్రభావానికి గురి చేసి ఆ తరువాత తనతో సెక్స్ జరిపేందుకు ఆమెను పురికొల్పాడు. తదనంతరం ఇద్దరం వివాహం చేసుకుందామని రాయ్ వాగ్దానం చేసినందున వారిద్దరు తరచు సెక్స్ జరిపేవారు. తనను గర్భనిరోధక మాత్రలు వేసుకోవలసిందని రాయ్ కోరినప్పుడు అతను తనను 'ఉపయోగించుకుంటున్నాడ'ని తాను గ్రహించానని, కాని తాను అతనిని గాఢంగా ప్రేమిస్తున్నందున తాను అతని వలలో చిక్కుకున్నట్లుగా భావించానని సుస్మిత తెలియజేసింది.
తనకు మేలు చేయవలసి ఉన్న మరొక వ్యక్తితో సెక్స్ కు సిద్ధపడవలసిందని ఆమెను రాయ్ కోరినప్పుడు పరిస్థితులు విషమించాయి. అయితే, మూడవ వ్యక్తితో తాను సెక్స్ జరిపానని సుస్మిత చేసిన ఈ ఆరోపణ నిజమనేందుకు సాక్ష్యాధారమేదీ లేదని హైకోర్టు భావించింది. 'ఈ ఆత్మహత్యా పత్రాన్ని మొత్తంగా పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. మృతురాలి భావోద్వేగాలను, ఆత్మహత్య పత్రంలో పేర్కొన్న వాస్తవాల ప్రకటనతో వేరు చేసి చూడవలసి ఉంటుంది' అని హైకోర్టు పేర్కొన్నది. వివాహం చేసుకుంటానన్న తప్పుడు వాగ్దానంతో తనతో సెక్స్ జరిపేట్లుగా సుస్మితను రాయ్ ప్రేరేపించాడని, కాని ఆమెను ఆత్మహత్యకు ఇది పురికొల్పినట్లుగా భావించరాదని ప్రాసిక్యూషన్ చేసిన వాదనతో హైకోర్టు ఏకీభవించింది.
Pages: -1- 2 News Posted: 11 February, 2009
|