మా అబ్బాయి బంగారం!
హైదరాబాద్: రాజకీ యాల్లో ప్రత్యర్థి పక్షాల అగ్రనేతల పరస్పర విమర్శలు, దాడులు, ప్రతిదాడులు ప్రజలకు కొత్త కాదు.ఎన్నికల సమ యంలో, అదీ కాకపోతే శాసనసభలు వేదికలుగా వాగ్బా ణాలు సంధించుకోవటం ప్రతిచోటా జరిగేదే. రాష్ట్రంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నేతలు నాలుగు సం వత్స రాల తొమ్మిది నెలల నుంచి సందర్భం వచ్చినప్పుడల్లా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటూనే ఉన్నారు. ఇదంతా ఆయా నేతలతోనే ఆగకుండా ఇప్పు డు వారి సంతానం చుట్టూ రాజకీయాలు కేంద్రీకృతమయ్యాయి. ముఖ్య మంత్రి రాజశేఖరరెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు కుమారుడు లోకేశ్‌నాయుడు ఇటీవల వెలుగులోకి వచ్చిన సత్యం కుంభకోణం తర్వాత వార్తల్లోకి రాని రోజు లేదు.
సత్యం కుంభకోణం డబ్బులన్నీ జగన్ నడుపు తున్న పత్రికకు, ప్రారంభించబోతున్న టీవీ చానల్‌కూ, మరో ఫ్యాక్టరీకీ మళ్ళాయని తెలుగుదేశం పార్టీ వాదిస్తుంటే, హెరిటేజ్ షేర్లనీ మరో బినామీ సంస్థకు మళ్ళించి మదుపు దారుల నోట మన్ను కొట్టారని కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. ఈ పరిణామాలు సోమ, మంగళవారాల్లో పరా కాష్ఠకు చేరుకున్నాయి. సోమవారం సత్యం కుంభకోణంపై మాట్లాడిన ప్రతిపక్ష నేత చాలాసార్లు జగన్ ప్రధాన టార్గెట్‌గా ఆరోపణలు చేశారు. ఒకదశలో మరింత ముందుకు పోయి చట్టపరంగా కఠినచర్యలు తీసుకోవాలన్న డిమాండ్ సైతం చేశారు. దానికి బదులుగా ముఖ్య మంత్రి మంగళవారం తనకు సమాధానం చెప్పే సందర్భంగా వచ్చిన అవకాశాన్ని పూర్తిగా వాడుకున్నారు. ఇద్దరు నేతలూ పరస్పరం పుత్రరత్నాలపై దాడులు, ప్రతి దాడులు చేసుకోవటం ఆయా పార్టీలకు ఎలా ఉన్నా సభలో మిగిలిన సభ్యులు మాత్రం ఆద్యంతం పూర్తి ఆసక్తితో వింటూ కూర్చున్నారు.
Pages: 1 -2- -3- News Posted: 11 February, 2009
|