మా అబ్బాయి బంగారం!
శాసనసభా వేదిక సాక్షిగా గత కొంతకాలం నుంచి, మరీ ప్రత్యేకంగా ఇటీవలి కాలంలో వైఎస్,చంద్రబాబు పరస్పర విమర్శలు చేసుకోవలసి వచ్చినప్పుడు వారి ఆగ్రƒ హం అదుపు తప్పి పోతున్నది. ఏకవచనంలో సంబోధించుకోవటమే సభా నిబంధనలకు విరుద్ధమైతే దానికి మించిన పదాలన్నీ యధేచ్ఛగా ప్రసంగాల్లోకి వచ్చి చేరుతున్నాయి. మంగళవారం నాటి ప్రసంగం సందర్భం గా వైఎస్ తనకు అడ్డుపడుతున్న టిడిపి ఉపనేత నాగం జనార్దనరెడ్డిని ఉద్దేశించి 'నీది నాలుకా? తాటిపట్టా' అని మండిపడ్డారు. సిగ్గు లేదు అనటం, బతుకు బయటపెడ తాననటం ఎవరు మాట్లాడినా పరిపాటి అయిపోయాయి.
Pages: -1- -2- 3 News Posted: 11 February, 2009
|