మా అబ్బాయి బంగారం!
సత్యం రామలింగరాజు కుమారుడు రామరాజు, చంద్ర బాబు కుమారుడు లోకేశ్ అమెరికాలో ఒకే చోట ఒకే గది లో ఉండి చదువుకున్నారని పత్రికల్లో వచ్చిన వార్తలను వైఎస్ ప్రధాన అస్త్రంగా చేసుకున్నారు. అది వాస్తవమా కాదా ముందు నిగ్గు తేల్చాలన్నప్పుడు చంద్రబాబు వారిద్ద రూ కలసి చదువుకున్న మాట వాస్తవమేనని, అయితే ఒకే గదిలో లేరని సమర్థించుకున్నారు. అందుకు బదులుగా ఎదురుదాడి చేస్తూ'నీ కుమారుడిని చెడగొట్టింది నీవే.. పెంపకం అలా ఉంటే ఎలా బాగుపడతారు?' అని చంద్ర బాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై తీవ్రంగా స్పందిం చిన వైఎస్ మరో అడుగు ముందుకేశారు. 'ఇప్పటి దాకా రామలింగరాజు, రామరాజు ఎవరో తెలియదన్నట్టు మాట్లాడావు. ఇప్పటికైనా నీ కుమారుడు, రామరాజు ఒకే చోట కలసి చదువుకున్నట్టు అంగీకరించావు. అయితే ఒకే గదిలో లేరన్నావు.
ఓకే...ఫైన్...అయితే ఒక్కటి...నీ కుమా రుడిపై మాట్లాడాలంటే...ఎందుకులే...చాలా ఉంది... చెప్పటం బాగుండదు. నా కుమారుడు అమెరికా వెళ్ళి నెల రోజులకే తిరుగుటపాలోవచ్చేశాడంటున్నారు. నిజమే. ఇంటిపై బెంగతో వచ్చాడు. తప్పేమిటి? మరి నీ కుమారుడి సంగతి...' అంటూ వైఎస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ టం సభలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. గ్యాలరీ ల్లో ఉన్న పత్రికల వారు సైతం నివ్వెరపోయారు. సోమవారం ఇదే సత్యం అంశంపై మాట్లాడిన చీఫ్ విప్ కిరణ్ కుమార్ రెడ్డి సైతం లోకేశ్ విషయం ప్రస్తావనకు వచ్చి నప్పుడు' నాకు తెలిసినవన్నీ చెప్పటం బాగుండదు... ఎంతైనా ఒకే జిల్లా వాళ్ళంకదా' అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. లోకేశ్ నాయుడుకు చదువు ఖర్చులన్నీ సత్యం సంస్థ భరించిందని వచ్చిన వార్తలను వైఎస్ ప్రస్తా వించినప్పుడు చంద్రబాబుమరోసారి తీవ్రంగా స్పంది„ సూ్త డబ్బు ఖర్చు వివరాలన్నీ ఉన్నాయి. ఆదాయం పన్ను రిటర్‌నలూ ఉన్నాయి. అన్నీ చూపిస్తా అని జీబదులిచ్చారు.
Pages: -1- 2 -3- News Posted: 11 February, 2009
|