కూటమిలో మ్యూజికల్ చైర్స్
ఇక టిఆర్ఎస్ మాజీ శాసనసభ్యుడు టి.పద్మారావు సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం ఈ స్థానానికి టెడిపి ఎంఎల్ఎ తలసాని శ్రీనివాస యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావుకు సన్నిహత సహచరుడైన పద్మారావు ఇదే నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయాలనుకుంటున్నట్లు తన మద్దతుదారులతో స్పష్టంగా చెప్పారు. కాగా శ్రీనివాస యాదవ్ ఒకప్పుడు సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో భాగంగా ఉన్న బన్సీలాల్ పేట నుంచి పాదయాత్ర ప్రారంభించారు.
త్యాగాలకు సిద్ధం కావలసిందిగా తన పార్టీ నాయకులకు చంద్రబాబు నాయుడు చేసిన విజ్ఞప్తిని మన్నించడానికి చాలా మంది సిద్ధపడడం లేదు. 'నేను నా సీటును త్యాగం చేయబోవడం లేదు. ఎవరైనా సీనియర్ ఆ పని చేస్తే బాగుంటుంది. నేను ఇంకా సాధించవలసింది ఎంతో ఉంది' అని టిడిపి మాజీ శాసనసభ్యుడు ఒకరు చెప్పారు. నల్లగొండ జిల్లాలో భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న టిడిపి మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి కూడా అదే నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయాలనుకుంటున్నట్లు విస్పష్టంగా ప్రకటించారు. టిఆర్ఎస్, వామపక్షాలు కూడా అదే సీటును కోరుతుండడం గమనార్హం.
Pages: -1- 2 News Posted: 13 February, 2009
|