కాంగ్రెస్ లో 'స్లేవ్ కల్చర్'
బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం తాము అక్కడ మసీదు నిర్మిస్తామని కాంగ్రెస్ ప్రకటించగా, ఆలయాన్ని నిర్మిస్తామని బిజెపి తెలియజేసిందని, ఇక బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్ పి) వ్యవస్థాపకుడు కాన్షీరామ్ తాము అక్కడ ఒక టాయిలెట్ ను నిర్మిస్తామని చెప్పారని అమర్ గుర్తు చేశారు. మసీదు కూల్చివేతలో కాంగ్రెస్ పాత్రను అమర్ ప్రశ్నిస్తూ, 'మసీదులో ఐదు శాతం మాత్రమే కూల్చివేసిన అనంతరం ఉత్తర ప్రదేశ్ (యుపి)లో రాష్ట్రపతి పాలన విధించారు. తక్కిన 95 శాతం కూల్చివేత కేంద్రంలో నరసింహారావు ప్రభుత్వం, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఉన్నప్పుడు జరిగింది' అని తెలియజేశారు.
కల్యాణ్ సింగ్ తో తన సంబంధాలను అమర్ సింగ్ గట్టిగా సమర్థించుకుంటూ, బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి 'ఇద్దరు సహనిందితులు కాంగ్రెస్-కేంద్ర ప్రభుత్వం, కల్యాణ్ సింగ్ ఉన్నారు' అని వాదించారు. 'కాంగ్రెస్ తో కరచాలనానికి, అదీ ప్రభుత్వాన్ని కాపాడేందుకు క్రియాశీలక భాగస్వామిగా, వారి అణు ఒప్పందాన్ని కాపాడడానికి మేము సిద్ధపడినప్పుడు బిజెపిని వ్యతిరేకించడమనే సిద్ధాంతంతో ఉన్న కల్యాణ్ సింగ్ తో ఎందుకు కరచాలనం చేయరాదు' అని అమర్ సింగ్ ప్రశ్నించారు.
కాంగ్రెస్ తనను 'పూర్తిగా అవాంఛనీయునిగా, అస్పృశ్యునిగా' భావించేట్లు చేసిందని, 'నేను బలమైన వెన్నెముక ఉన్నవాడిని కావడం, కాంగ్రెస్ ది బానిస సంస్కృతి కావడం వారికి ఇబ్బంది కలిగిస్తున్నట్లున్నది' అని అమర్ వ్యాఖ్యానించారు.అయితే, ఆ పార్టీతో తాము సంబంధాలను తెంచుకోబోమని ఆయన చెప్పారు. తనకు 'సోనియా గాంధీితో సన్నిహత సంబంధాలు కాకపోయినా అత్యంత అద్భుతమైన, సాంప్రదాయక సంబంధాలు ఉన్నాయి. మన్మోహన్ సింగ్ తో చక్కని అవగాహన ఉంది. అయితే, కాంగ్రెస్ తో గొప్ప అనుబంధం ఉందని నేను భావించడం లేదు' అని ఆయన చెప్పారు.
కాంగ్రెస్ లేకపోతే ఎస్ పి కుప్పకూలిపోతుందనే కారణంతో ఆ పార్టీతో సంబంధాలను తెంచుకోవడానికి వెనుకాడుతున్నారా అనే ప్రశ్నకు అమర్ కాదని సమాధానం ఇచ్చారు. 'రాజకీయాలలో మీరు ఆచరణాత్మక, వాస్తవిక దృక్పథంతో, తెలివిగా వ్యవహరించవలసి ఉంటుంది. దీని వల్ల మీకు నిందలు తప్పుతాయి. అవి దిగ్విజయ్ సింగ్ పైనే పడాలి' అని అమర్ అన్నారు. కాంగ్రెస్ పట్ల అసంతుష్టికి యుపిలో సీట్ల పంపకం చర్చలు, ఎస్ పి అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ పై సిబిఐ కేసు అసలు కారణాలనే వాదనను కూడా ఆయన ఖండించారు. తాను ఆ పార్టీ ఎత్తుకు పైయెత్తు వేస్తానని చెబుతూ, 'అలా చేయడం తప్పేమి కాదు కదా' అని అమర్ అన్నారు.
Pages: -1- 2 News Posted: 14 February, 2009
|