'టి' కమిటీలో సమైక్య మసాలా!
ఇక ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం వంటి జిల్లాలు, విశాఖపట్నం జిల్లాలోని చాలా ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి. అక్కడి వారు కూడా ప్రత్యేక రాష్ట్రం కావాలని అడుగుతున్నారు. అయితే, వారు తమ డిమాండ్ తో అంతగా హడావుడి చేయడం లేదు. 'రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతాలు ఉత్తరాంధ్రలో ఉన్నాయి. జనం ఇప్పటికీ ప్రధాన జీవన స్రవంతిలో ప్రవేశించలేదు' అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఆయనది విజయనగరం జిల్లా. 'నగరాలకు భారీ సంఖ్యలో వలసల కారణంగా వాస్తవానికి అక్కడ జనాభా కూడా తగ్గిపోయింది' అని ఆయన చెప్పారు.
రాయలసీమకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. రాయలసీమలో ప్రత్యేక రాష్ట్రం కోసం 'గ్రేటర్ రాయలసీమ' కోసం సాగిన రాజకీయ ఉద్యమాలు అలజడి సృష్టించాయి. ఈ ప్రాంతానికి చెందిన రాష్ట్ర మంత్రి జె.సి. దివాకరరెడ్డి అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కనుక ఏర్పడితే అనంతపురం జిల్లాను కర్నాటకకు బదలీ చేయాలనే అభ్యర్థనకు తాను మద్దతు ఇస్తానని బాహాటంగా ప్రకటించారు.
Pages: -1- 2 News Posted: 15 February, 2009
|