'బడ్జెట్ లైవ్' చూసిన ప్రధాని
తృతీయ ఉద్దీపన ప్యాకేజీ ప్రతిపాదన ఏదీ అసలు పరిశీలనలో లేనందున పరిశ్రమ ఇప్పుడు తమను పట్టించుకోలేదని 'బాధ పడేందుకు కారణం లేదు' అని ఆ వర్గాలు వ్యాఖ్యానించాయి. 'మొదటి రెండు ఉద్దీపన ప్యాకేజీల ఫలితాలు వాటిని ఉద్దేశించిన లబ్ధిదారులకు చివరకు చేరాయా లేదా అనేది తేల్చుకోవడానికి ప్రభుత్వం ఇంకా ప్రయత్నిస్తున్నది' అని ఒక ప్రతినిధి తెలియజేశారు. 'మధ్యంతర బడ్జెట్ సంబంధిత' పత్రాలను డాక్టర్ మన్మోహన్ సింగ్ పరిశీలించి, వాటిపై సంతకం చేసి, రాష్ట్రపతికి పంపారని తెలియజేసేందుకు ప్రధాని కార్యాలయం (పిఎంఒ) ఆదినారం రాత్రి కొద్ది మంది జర్నలిస్టులకు ఒక ప్రకటన పంపింది. ప్రణబ్ ముఖర్జీ చేసే ప్రసంగానికి కూడా ఆయన ఆమోద ముద్ర వేశారు. ప్రణబ్ ఆదివారం డాక్టర్ సింగ్ ను కలుసుకున్నారని పిఎంఒ ఆ ప్రకటనలో తెలిపింది.
బడ్జెట్ సమర్పణకు ఒక గంట ముందు సాంప్రదాయకంగా జరిగే మంత్రివర్గ సమావేశానికి ప్రధాని హాజరయ్యే అవకాశం లేనందున ప్రణబ్ ముఖర్జీని కలుసుకోవాలని కోరుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి. సాధారణంగా చివరి క్షణంలో ఏవైనా మార్పులు చేయాలని ప్రధాని అభిలషించినట్లయితే, ఆయన మంత్రివర్గం ఆమోద ముద్ర పొందవలసి ఉంటుంది. అందుకోసం మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయవలసి ఉంటుంది కూడా. డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎటువంటి సవరణనూ ప్రతిపాదించలేదని తెలుస్తున్నది.
ప్రధాని ఇక ఫైళ్ళ పరిశీలనను ప్రారంభించగలరని తెలియజేయడమే పిఎంఒ ప్రకటన ప్రధానోద్దేశమని ఆ వర్గాలు పేర్కొన్నాయి. డాక్టర్ మన్మోహన్ సింగ్ నంబర్ 3 రేస్ కోర్స్ రోడ్ నివాసంలో కాకుండా తన 'అసలు నివాసం' నంబర్ 5 రేస్ కోర్స్ రోడ్ భవనంలోనే టివిని తిలకించారని ఆ వర్గాలు తెలియజేశాయి. ఆ రెండు బంగళాలూ నంబర్ 7 రేస్ కోర్స్ రోడ్ గా అధికారికంగా పేర్కొనే ఒకే ప్రాంగణంలోనే ఉన్నప్పటికీ డాక్టర్ సింగ్, ఆయన కుటుంబం నంబర్ 5 భవనంలోనే నివసిస్తున్నారు. ఆ భవనం ఆయన గురువు మాజీ ప్రధాని పి.వి. నరసింహారావుకు కూడా నివాసంగానే ఉండేది.
Pages: -1- 2 -3- News Posted: 17 February, 2009
|