'బడ్జెట్ లైవ్' చూసిన ప్రధాని
సర్జరీ అనంతరం డాక్టర్ మన్మోహన్ సింగ్ ను ఇంటికి తిరిగి తీసుకువచ్చినప్పుడు ఇన్ఫెక్షన్లకు గురి కాకుండా జాగ్రత్త పడేందుకు ఆయనను నంబర్ 3 బంగళాలో ఆయనను తాత్కాలికంగా 'క్వారంటైన్' చేయాలని (ఒంటరిగా ఉంచాలని) డాక్టర్లు సూచించారు. 'క్వారంటైన్'లో ఆయన సతీమణిని, డాక్టర్లను, నర్సులను మాత్రమే ఆయనను కలుసుకోనిచ్చారు. అయితే, ఇద్దరు పిఎంఒ అధికారులు మాత్రం మధ్య మధ్యలో కొద్ది సేపు ఆయనను కలుసుకోగలిగేవారు. ఇది వోటాన్ అకౌంటే అయినప్పుడు బడ్జెట్ కు ఎందుకింత హడావిడి చేస్తున్నారో డాక్టర్ సింగ్ కు అంతుబట్టలేదని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.
ఒక నెల క్రితం వరకు కూడా 'ఈవెంట్'గా పేర్కొంటున్న ఈ ప్రక్రియపై తమ ప్రచారం స్థాయిని కాంగ్రెస్, ప్రభుత్వం కొంత తగ్గించి 2008లో వలె కేవలం పునరుటంకన స్థాయికి మార్చి ఉంటే, అఁదుకు పరిస్థితులే పురికొల్పాయనాలి. ఆర్థిక పెట్టుబడులు అవసరమైన పథకాలు, కొత్త విధానాలను ప్రకటించేందుకు ప్రభుత్వాన్ని ఆనవాయితీ, ఔచిత్యం అనుమతించనప్పటికీ, ఆ రెండు విషయాలలోను తన ఉద్దేశాలపై కేంద్రం స్థూలంగా సంకేతాలు పంపి ఉండవచ్చునని ఆ వర్గాలు సూచించాయి. అయితే, ప్రతిపక్షాలు వోటింగ్ ను కోరినట్లయితే, సమాజ్ వాది పార్టీ మద్దతు తథ్యమని యుపిఎ ధీమాగా వ్యవహరించజాలదనే అభిప్రాయంతోనే ప్రభుత్వం అలా చేయలేదు.
Pages: -1- -2- 3 News Posted: 17 February, 2009
|