ఫ్రిడా పింటో రహస్య వివాహం?
తమ పెళ్లి గురించి అందరికీ తెలియడం ఇష్టంలేనందున రహస్య వివాహం చేసుకోవాలని అనుకుంటున్నట్టు ఫ్రిండా తన మిత్రులతో కూడా చెప్పందట. 'తమ పెళ్లి గురించి బహిరంగంగా చెప్పేందుకు సిద్ధపడేంతవరకూ పెళ్లి విషయాన్ని సీక్రెట్ గానే ఉంచాలని వారిద్దరూ నిశ్చయించుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రోహన్ కు ఉద్వాసన చెప్పినా ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడే తత్వం రోహనకు లేదు. నిజానికి స్లమ్ డాగ్ మిలియనీర్ షూటింగ్ పూర్తయ్యేంతవరకూ ఇద్దరూ కలిసే ఉన్నారు. అంతర్జాతీయంగా ఈ చిత్రం గురించి అంతా చర్చించుకోవడం మొదలయ్యే సరికి రోహన్ కు ఉద్వాసన చెప్పాలని ఫ్రిండా నిశ్చయించుకుంది' అని సదరు వ్యక్తి తెలిపారు. అధికారికంగా వారిద్దరూ డైవర్స్ తీసుకునే అవకాశాలున్నాయా అని అడిగినప్పుడు, రోహన్ ఇప్పటికీ షాక్ లోనే ఉన్నాడనీ, అయితే ఏమి జరుగుంతదనే ఇంకా స్పష్టం కాలేదనీ ఆయన సమాధానమిచ్చారు. ఇందుకు తగ్గట్టుగానే ఈ నెలలోనే నెట్ వర్క్ సైట్ 'ఫేస్ బుక్' లో రోహన్ తన స్టాటస్ ను 'కమిటెడ్' నుంచి 'సింగిల్ ' గా మార్చుకున్నారు. ఇదే సైట్ లో ఇంతకుముందు తన స్టాటస్ ను 'ఎంగేజ్డ్'గా రోహన్ పేర్కొనడం పట్ల ఫ్రిండా అసంతృప్తి వ్యక్తం చేసిందట. ఈ విషయమై ఫ్రిడాను పలుమార్లు సంప్రదించినప్పటికీ ఆమె నుంచి ఇంకా ఎలాంటి వివరణా అందలేదు.
Pages: -1- 2 News Posted: 17 February, 2009
|