6000 కోట్లతో ధూమ్ ధామ్!
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ కోసం మూడవ ఉద్దీపన ప్యాకేజీ గురించిన ప్రస్తావనేదీ లేనందున ప్రణబ్ ముఖర్జీ ప్రతిపాదించిన మధ్యంతర బడ్జెట్ నిరాశకు గురి చేసి ఉండవచ్చు కాని రానున్న లోక్ సభ ఎన్నికలు మరొక రకంగా ఉద్దీపన కలిగించవచ్చునని భావిస్తున్నారు. ఈ ఎన్నికల వ్యవస్థలోకి సుమారు రూ. 6000 కోట్లను గుప్పించబోతున్నారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తమ ప్రచారానికి అపారంగా నిధులు ఖర్చు చేయనున్నారు. ఇక ఎన్నికల కమిషన్ (ఇసి) ఎన్నికల నిర్వహణ కోసం భారీగానే బిల్లు చెల్లించగలదు. దీనితో వృద్ధికి స్ఫూర్తి ఇస్తుండే సేవల రంగమే దీని నుంచి ప్రధానంగా లబ్ధి పొందనున్నది.
అయితే, ఎన్నికల సమయంలో ఏదైనా పార్టీ లేదా అభ్యర్థి ఖర్చు చేసే మొత్తంపై ఎన్నికల నిబంధనలు పరిమితులు విధిస్తున్నాయి. కాని వాస్తవంలో అసలు వ్యయాలు అటువంటి పరిమితులకు మించి దాదాపు నాలుగైదు రెట్లు ఉంటున్నాయి. వీటన్నిటికీ మించి మద్దతు గ్రూపులు చేసే అనామతు ఖర్చులు ఉన్నాయి. దీనితో ఎన్నికల ప్రచార సమయంలో చేతులు మారే నిధుల పరిమాణం బాగా పెరిగిపోతూ ఉంటుంది.
రాజకీయ పార్టీలు పైకి దీనిని ఖండించవచ్చు. కాని ఆంతరంగికగా ప్రతి రాజకీయ నాయకుడూ ఒక వాస్తవాన్ని అంగీకరిస్తాడు. ఒక లోక్ సభ స్థానానికి పోటీ చేయడానికి అధికారిక ఖర్చు పరిమితి రూ. 25 లక్షలు కాగా సీరియస్ అభ్యర్థి ఎవరైనా సగటున కనీసం రూ. 2 కోట్లు ఖర్చు చేస్తుంటారనేదే ఆ వాస్తవం. కొన్ని నియోజకవర్గాలలో, ముఖ్యంగా మెట్రో నగరాలలో అభ్యర్థులు ఇంకా అధికంగానే ఖర్చు చేస్తారు. ఉదాహరణకు, ముంబైలో ఒక నియోజకవర్గంలో ప్రతి మూడవ అభ్యర్థి దండిగా డబ్బు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తున్నది.
Pages: 1 -2- -3- News Posted: 18 February, 2009
|