6000 కోట్లతో ధూమ్ ధామ్!
రానున్న ఎన్నికలలో చాలా వరకు పోటీలు ముక్కోణపువే కాగలవనుకుంటున్నారు. మరొక విధంగా చెప్పాలంటే, అత్యధిక స్థానాలకు కనీసం ముగ్గురు సీరియస్ అభ్యర్థులు పోటీ పడనున్నారు. అంతేకాకుండా, నియోజకవర్గాల పునర్విభజన వల్ల ప్రతి నియోజకవర్గం రూపురేఖలు మారిపోయాయి. దీనితో కొత్త వోటర్లు వచ్చారు. గతంలో తాము దృష్టి నిలపని ఈ వోటర్లను ఆకట్టుకోవడానికి అభ్యర్థులు మరింత వ్యయం చేయవలసి ఉంటుంది.
అందువల్ల, 543 లోక్ సభ స్థానాలలో ప్రతి స్థానానికి సగటున ముగ్గురు సీరియస్ అభ్యర్థులు ఉంటారని ఊహించుకుంటే, వీరు చేసే ఖర్చే కనీసం రూ. 3258 కోట్ల మేరకు ఉండగలదు. పార్టీల సంఖ్య, ఆశయాకాంక్షలు పెరిగిపోవడాన్ని దృష్టిలో పెట్టుకుంటే, మోతుబరులైన తిరుగుబాటు అభ్యర్థులు, తమ తమ రాజకీయ, ఆర్థిక పలుకుబడి లేదా ఏదైనా బలమైన స్థానిక పార్టీతో అనుబంధం ఉన్న ఇతర అభ్యర్థులు ఉండవచ్చు. వారు ఒక్కొక్కరు రూ. 20 నుంచి రూ. 50 లక్షలు వరకు ఖర్చు చేయవచ్చు. దేశవ్యాప్తంగా అటువంటి అభ్యర్థులు చేసే ఉమ్మడి వ్యయం ఎంత లేదనుకున్నా రూ. 250 కోట్ల వరకు ఉండవచ్చు.
ఇక పార్టీలు చేసే ఖర్చులు ఉన్నాయి. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఒక్కొక్కటి ఈ దఫా దాదాపు రూ. 200 కోట్లు ఖర్చు చేయగలవని భావిస్తున్నారు. ప్రచార యంత్రాంగం నిర్వహణకు, అభ్యర్థులకు ఒకేసారిగా జరిపే చెల్లింపులకు చేసిన ఖర్చుల కిందకు ఇవి వస్తాయి. కీలక రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బిఎస్ పి, బిజెడి, జెడియు, డిఎంకె, ఎన్ సిపి వంటి బలమైన ప్రాంతీయ పార్టీలు, గతంలో అధికారం చెలాయించిన, ఇప్పటికీ బలాధిక్యం ఉన్న టెడిపి, ఎఐఎడిఎంకె, శివసేన వంటి పార్టీలు కూడా పైసా పైసాకు లెక్క చూసుకోకపోవచ్చు. అవన్నీ కలిపి ఇంకా రూ. 250 కోట్లు, అంతకు మించి ఖర్చు చేయవచ్చు.
Pages: -1- 2 -3- News Posted: 18 February, 2009
|