6000 కోట్లతో ధూమ్ ధామ్!
ఇది కాకుండా, ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ చేసే ఖర్చు రూ. 1300 కోట్లకు పైగానే ఉండవచ్చు. ఇది 2004లో గత లోక్ సభ ఎన్నికల నిర్వహణకు అయిన ఖర్చు. సోమవారం మధ్యంతర బడ్జెట్ లో ఇందు నిమిత్తం రూ. 850కోట్లు మాత్రమే కేటాయించారు. కాని ఎన్నికల నిర్వహణ ఖర్చు 1999లోని రూ. 880 కోట్ల నుంచి ఐదు సంవత్సరాల తరువాత రూ. 1300 కోట్లకు పెరిగిపోవడాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ పర్యాయం ఈ మొత్తం ఇంకా పెరగక తప్పదు.
కాగా, ఇసి చేసే ఖర్చులు మినహా మిగిలిన అన్ని ఖర్చులూ కాగితంపై కనిపించవనేది కాదనలేని సత్యం.. ఉదహరణకు, 2004 ఎన్నికలలో కాంగ్రెస్ తాను చేసిన ఖర్చు రూ. 125 కోట్లు అని వెల్లడించింది. బిజెపి అయితే తాను కేవలం రూ. 42 కోట్లు ఖర్చు చేసినట్లు తెలియజేసింది. తాను అభ్యర్థులకు ఏకమొత్తంగా జరిపిన చెల్లింపులకు వెచ్చించిన మొత్తాన్ని బిజెపి ఈ పద్దులో చూపలేదు. అయితే, ఆర్థిక వ్యవస్థకు ముఖ్యమైనది కాగితంపై కనిపించేది కాకుండా వాస్తవంగా జరిగే ఖర్చులే. ఇక వాహనాలు, షామియానాలు, పోస్టర్లు, సౌండ్ సిస్టమ్ లు, ఇతర అనుబంధ సేవలు అందించేవారికి దండిగా నిధులు అందబోతున్నాయనేది వాస్తవం.
Pages: -1- -2- 3 News Posted: 18 February, 2009
|