రెక్కవిప్పిన నిరుద్యోగం
ప్రపంచ వ్యాప్తంగా 2009లో స్వదేశాలకు డబ్బు పంపడం (రెమిటెన్స్) బాగా తగ్గిపోయింది. ఆర్ధిక మాంద్యం కారణంగా ఇలా జరిగింది. తూర్పు ఆసియా, పసిఫిక్ ప్రాంతాలకు 44 శాతం , దక్షిణాసియాకు 28 శాతం మాత్రమే రెమిటెన్సులు వెళ్లాయని ఐఎల్ఓ నివేదిక తెలిపింది. శ్రామిక శక్తి గ్లోబల్ డిమాండ్ మందగించడంతో ఆసియా నుండి కొద్ది సంఖ్యలో మాత్రమే 2009లో వలస వెళ్లే అవకాశముంది. తొంగా డిజిపిలో మూడవ వంతు ఈ రెమిటెన్సుల నుండి వస్తోంది. అదే విధంగా నేపాల్ జిడిపిలో 17 శాతం, ఫిలిప్పైన్స్ జిడిపిలో11 శాతం, బంగ్లాదేశ్ జిడిపిలో 9.7 శాతం, శ్రీలంక జిడిపిలో 8.3 శాతం ఈ రెమిటెన్సులే ఉన్నాయి.
ఉత్పత్తి క్షీణించడంతో అత్యంత ఘోరమైన పని పరిస్థితులు నెలకొన్నాయి. అనియతమైన, అభద్రతాయుతమైన ఉపాధి అవకాశాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని ఆ నివేదిక తెలిపింది. ఉద్యోగ భద్రత లేని ఉద్యోగస్తులు ఆసియాలో నిరుడు 108 కోట్ల మంది ఉన్నారు. ఈ ఏడాది వారి సంఖ్య అత్యల్పంగా 2.1 కోట్ల నుండి 6.1 కోట్లు దాకా పెరగనుంది. అందువల్ల ప్రభుత్వాలు ప్రకటించే ఉద్దీపన ప్యాకేజిలు ఉపాధిని కల్పించడం ద్వారా స్థానిక ప్రజల కొనుగోలు శక్తిని పెంచి తద్వారా స్థానిక వినియోగాన్ని, డిమాండ్ ను పెంపొందింప చేయాల్సి ఉంటుంది. ఆ రకంగా ఆర్ధికాభివృద్దిని పెంపొందించగలమని ఐఎల్ఓ నివేదిక పేర్కొంది.
Pages: -1- 2 News Posted: 18 February, 2009
|