`బంధం' తెంచిన రామోజీ..!
హైదరాబాద్: `ఈనాడు' సామ్రాజ్యాన్ని సమూలంగా నాశనం చేసేందుకు వైరిపక్షాలు వేయి `హస్తాలు' చాచినా రామోజీరావు చలించలేదు... అయితే స్వయానా తన కొడుకు సుమన్ శత్రువు వలకు చిక్కి తనకు వ్యతిరేకంగా చిలుక పలుకులు పలికినప్పుడు మాత్రం విలవిలలాడిపోయారు... ఈటీవీ ఇంటిపోరు `సాక్షి' పత్రికకు ఎక్కినప్పుడు తల్లడిల్లిపోయారు.
చెడు స్నేహం కారణంగా సుమన్ దారితప్పుతున్నాడని రామోజీ రావు భావించారు. సీరియల్ నటుడిగా రంగప్రవేశం చేసి, సుమన్ అండతో ఈటీవీకి పర్యాయపదంగా మారిన ప్రభాకర్ ను ఇంటికి పంపితే పరిస్థితులు చక్కబడతాయని అనుకున్నారు. అయితే ప్రభాకర్ ను బయటికి పంపిన వెంటనే, మిత్రుని కోసం సుమన్ తండ్రినే ధిక్కరించారు. ఎం.డి. పదవికి రాజీనామా చేసి బయటికి వెళ్లిపోయారు. ఈ వ్యవహారం ముదిరి, మూడు నెలల క్రితం సుమన్, ప్రభాకర్ ఉమ్మడిగా రామోజీపై అతని శత్రువుల `సాక్షి'గా ధ్వజమెత్తారు. అయితే, సుదీర్ఘ ఇంటర్వ్యూలో తండ్రిపై సుమన్ చేసిన విమర్శలు అతని అపరిపక్వతకు అద్దం పట్టాయి. ఈటీవీ ఇంటిపోరును వీధికెక్కించడం ద్వారా `సాక్షు'లు అలౌకిక ఆనందం పొందవచ్చుగానీ, నిజానికి ఆ ఇంటర్వ్యూ రామోజీకే సానుభూతిని పెంచింది.
Pages: 1 -2- -3- News Posted: 18 February, 2009
|