`బంధం' తెంచిన రామోజీ..!
`సాక్షి' ఇంటర్వ్యూ వల్ల సుమన్, ప్రభాకర్ ల పరువే బజారుకెక్కింది. వారిద్దరి విచిత్ర బంధంపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. సుమన్, ప్రభాకర్ లది రామలక్ష్మణ బంధమా? హనుమంతుడి సంబంధమా? లేక సీతారాముల అనుబంధమా? అనే ప్రశ్నలను సంపాదకులు ఇంటర్వ్యూ లీడ్ లో సంధించారు. మొత్తంమీద రాష్ట్రంలో ఇద్దరు మగాళ్ల మధ్య అతి సన్నిహిత సంబంధంపై బాహాటంగా చర్చ జరగడం మాత్రం అదే మొదటిసారి.
కాదనుకొని బయటికి వెళ్లినా... తనపైనే బురద చల్లినా...కన్నకొడుకు కాబట్టి సుమన్ ను ఈ విచిత్ర బంధం నుంచి బయటపడేయాలని రామోజీరావు మూడు నెలల క్రితం నడుంకట్టారు. ఆ ప్రయత్నాలు ఇంతకాలానికి ఫలించాయి. తాజా వార్త ఏమిటంటే... ప్రభాకర్ అంటే సుమన్ కు పడడం లేదు. కలవడం లేదు, కనీసం మాట్లాడడం కూడా లేదు. అతనిప్పుడు బుద్ధిగా ఈటీవీ కార్యాలయానికి వెళ్లి తనపని తాను చేసుకుంటున్నారు. కొడుకుకు కనువిప్పు కలిగించేందుకు రామోజీ రావు ప్రత్యేకంగా పూనుకోవలసి వచ్చిందని ఈటీవీ వర్గాలు తెలిపాయి. అయితే...
సుమన్ కు జనంతో కలిసిపోయి పని చేయించడం చేతకాదు. ఎవరో ఒకరిని నమ్మి, వారిపై ఆధారపడే మనస్తత్వమే ప్రభాకర్ ను అతనికి దగ్గర చేసింది. ఇప్పుడు ప్రభాకర్ లేకపోయినా, ఇంకోవ్యక్తి తోడు మాత్రం సుమన్ కు తప్పనిసరి. తాజాగా ఇంద్రనాథ్ అనే సీరియల్ నటుడు సుమన్ కు చేదోడువాదోడుగా ఉంటున్నారట. అతను ఇంకో ప్రభాకర్ గా మారే అవకాశాలు ఎంతమాత్రమూ లేవని, రామోజీ పరీక్షలో పాసైన తర్వాతే సుమన్ కొలువులో అతనికి ప్రవేశం కల్పించారని ఈటీవీ వర్గాల కథనం. ఈ పరిణామాల వల్ల... ప్రభాకర్ ప్రధాన పాత్రగా రూపొందిన బంధం, పద్మవ్యూహం ధారావాహికలు అటకెక్కినట్లే. యాహూ గేమ్ షో కూడా ఈటీవీ ఆర్కైవ్స్క్ కు పరిమితమవుతుంది.
Pages: -1- 2 -3- News Posted: 18 February, 2009
|