`బంధం' తెంచిన రామోజీ..!
తండ్రిపై అలిగి ఈటీవీకి దూరమైన తర్వాత సుమన్ కు పనిలేకుండా పోయింది. తాను ప్రధానపాత్రగా రూపొందిన ఉషాపరిణయం పౌరాణిక టెలీసీరియల్, స్వీయదర్శకత్వంలో తానే నటించిన అనురాగాలు సీరియల్ ఆగిపోయాయి. వాటి ప్రివ్యూలు చూసుకోవడం తప్ప టీవీలో చూసుకునే భాగ్యానికి నోచుకోక ఇంతకాలం ఇబ్బంది పడ్డ సుమన్ త్వరలోనే వాటిని ఈటీవీలో ప్రసారానికి షెడ్యూల్స్ సిద్ధం చేస్తున్నారట... ఈసారి ఈటీవీ మొత్తాన్ని సుమన్ కు ఆటవస్తువులా ఇచ్చేయకుండా కొన్ని స్లాట్స్ కే పరిమితం చేసేలా రామోజీరావు పకడ్బందీ ప్రణాళికతో ఉన్నారట.
ఇంకోవైపు ప్రభాకర్.... మిత్రునిపై ఆశలు వదులుకొని జీటీవీ, లోకల్ టీవీలలో ప్రోగ్రామ్స్ చేసుకుంటున్నారు. ఇంకో రెండు టీవీ చానళ్ల నుంచి ఉద్యోగం ఆఫర్లు ఉన్నాయట. ఏదేమైనా మళ్లీ అతనికి సుమన్ లాంటి ఆత్మీయ మిత్రుడుగానీ, అతిగా అల్లుకుపోయే అవకాశంగల చానల్ గానీ దొరక్కపోవచ్చు...!
మరోవైపు సుమన్... తండ్రి ఇచ్చిన స్లాట్స్ తో సంతృప్తి చెందుతారా, లేక ఇంద్రనాథ్ ను కలుపుకొని ఇంకో చానల్ పెట్టే ప్రణాళికను బయటికి తీస్తారా అనేది చూడాలి. సుమన్ కు నిలకడ తక్కువనీ, ఎదుటివారి మాట వినే అలవాటు లేదని అతడిని దగ్గరగా చూసిన ఈటీవీ వర్గాలు అంటున్నాయి. చూడాలి మరి..!
Pages: -1- -2- 3 News Posted: 18 February, 2009
|