ఎమ్ఎన్ సిలకు కటకట
హైదరాబాద్: ఎమ్ఎన్ సి ల్లో ఉద్యోగులకు ఒకప్పుడు రాజ మర్యాదలు సాగేవి. లక్షల రూపాయలు జీత భత్యాలతోపాటు, అత్యంత విలాసవంతమైన సౌకర్యాలు ఎమ్ ఎన్ సి ఉద్యోగులు ఆఫీల్లో అనుభవించేవారు. దాంతో సమాజంలో వారికి మంచి ప్రతిష్ట వచ్చింది. ఎమ్ఎన్ సి ఉద్యోగులతో పెళ్లి సంబంధాలను కుదుర్చుకోవడమంటే ఆ రోజుల్లో చాలా గొప్ప విషయం.అందుకోసం చాలా మంది ఎగబడేవారు. ప్రస్తుత ఆర్థిక సంక్షోభ కాలంలో అడ్డూ అదుపులేని ఖర్చులకు భారత కార్పొరేట్ సంస్థలు స్వస్తి పలికాయి. డబ్బుల కొరతలో ఎమ్ ఎన్ సిలు కటకటలాడుతున్నాయి. వికాస కాలంలోని ఖర్చుల్ని తగ్గించుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. దాంతో పలు అంశాలపై విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్న కంపెనీలు పలు పొదుపు చర్యల్ని చేపట్టాయి. ఉద్యోగులను తొలగించడం, జీత భత్యాల్ని తగ్గించివేసే చర్యలతోపాటు పలు అంతర్గత రంగాల్లో కంపెనీలు పొదుపు చర్యలు చేపట్టాయి.
వికాస కాలంలో ఎమ్ఎన్ సి సంస్థల, ఐటి కంపెనీల ఉద్యోగులకు మహర్ధశ పట్టింది. వారికి పలు తినుబండారాలను, పానియాలను కంపనీలు ఉచితంగా సరఫరా చేసేవి. ఇప్పుడు అలాంటి ఖరీదైనా పానీయాలను ఉద్యోగులకు అందించడాన్ని కంపెనీలు నిలిపివేశాయి. పళ్ల రసాల బదులు టీ, కాఫీలను మాత్రమే ఉద్యోగులకు అందిస్తున్నాయి. అదే విధంగా గతంలో చాలా నాణ్యమైన, ఖరీదైన బిస్కెట్లను ఉద్యోగులకు కంపెనీలు అందించేంది. ఇప్పుడు సాదాసీదా బిస్కేట్లను మాత్రమే ఉద్యోగులకు అందిస్తున్నారని ఒక బహుళ జాతి సంస్థ ప్రతినిధి తెలిపారు.
Pages: 1 -2- News Posted: 19 February, 2009
|