ఎమ్ఎన్ సిలకు కటకట
కంపెనీ ఎగ్జిక్యూటివ్ ల ప్రయాణ ఖర్చుల విషయంలో కూడా కంపెనీలు చాలా పొదుపు చర్యల్ని చేపట్టాయి. గతంలో కంపెనీ ఎగ్జిక్యూటివ్ లు బిజినెస్ క్లాస్ లో మాత్రమే ప్రయాణించేవారు. అయితే ప్రస్తుతం ఎకానమీ క్లాసులోనే ప్రయాణించాలని కంపెనీలు ఆంక్షలు విధించాయి అదే విధంగా రాత్రి పూట లాడ్జీల్లో బస చేయడాన్ని సాధ్యమైనంత వరకు వదిలేయాలని ఎగ్జిక్యూటివ్ లను కంపెనీలు ఆదేశించాయి. గతంలో ప్రయాణం చేసే సమయంలో తమతో పాటు పనుల్ని చేసి పెట్టేందుకు ఒక సేవకుడ్ని తీసుకెళ్లేవారు. ఇప్పుడు అలాంటి సౌకర్యాలన్నిటికీ కంపెనీలు స్వస్తి చెప్పాయి.
జిఎమ్ఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు లిమిటెడ్, డాక్టర్ రెడ్డీ ల్యాబ్స్ సంస్థలు కూడా ఇలాంటి పొదుపు చర్యల్ని చేపట్టాయి. ఒక రోజులో మూడు మీటింగులు ఉన్నట్లయితే మరో నగరానికి ప్రయాణం చేయడం కష్టంగా ఉంటుంది. అందువల్ల వీడియో కాన్పరెన్సుల్ని ఏర్పాటు చేసుకోవాలని ఎగ్జిక్యూటివ్ లకు కంపెనీ సూచించింది.గతంలో కంపెనీ ఎగ్జిక్యూటివ్ లకు ప్రత్యేకమైన కార్లను కంపెనీ ఏర్పాటు చేసింది. అయితే ప్రస్తుతం వాహనాలను ఉమ్మడిగా అట్టిపెట్టి కంపెనీ అవసరాలుకు మాత్రమే వాహనాలను వినియోగించవలసి ఉంటుంది.
అదే విధంగా కంపెనీలు ఎంటర్ టైన్మెంట్ బడ్జెట్లపై కూడా కోత విధించాయి ఆఫీసు పార్టీల పేరుతో జరిగే విచ్చల విడి ఖర్చును తగ్గించి వేశాయి. ఏదైన ముఖ్యమైన బిజినెస మీటింగ్ సందర్భంలో తప్ప వీకెండ్ పార్టీలకు, విలాసవంతమైన ఆఫీసు పార్లటిలను కంపెనీలు నిలిపివేశాయి. దాంతోపాటు కంపెనీ స్టేషనరీ ఐటమ్ లు, కమ్యూనికేషన్, విద్యుత్ వినియోగం లాంటి అంశాలపై కూడా కంపెనీలు పొదుపు చర్యలు చేపట్టాయి. మారుతి కంపెనీ కేవలం ఆర్ అండ్ డి విభాగం, అమ్మకాల విభాగానికి తప్ప మిగిలిన నైట్ షిఫ్టులను రద్దుచేసింది. సాయంకాలం 6 గంటల వరకు మాత్రమే లైట్లను వెలిగించవలసి ఉంటుంది.
Pages: -1- 2 News Posted: 19 February, 2009
|